Twitter Deal Row: ట్విట్టర్ డీల్ వెనుక ట్రంప్ ఉన్నాడా?: ఎలాన్ మస్క్ ఏమన్నారంటే!

ఎలాన్ మస్క్ కంటే ముందే ట్విట్టర్ ను కొనుగోలు చేయాలంటూ గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఆదేశించాడని మాజీ ప్రతినిధి డెవిన్ నున్స్ తెలిపారు.

Twitter Deal Row: ట్విట్టర్ డీల్ వెనుక ట్రంప్ ఉన్నాడా?: ఎలాన్ మస్క్ ఏమన్నారంటే!

Twitter

Twitter Deal Row: టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్..ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ “ట్విట్టర్”ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మస్క్ ట్విట్టర్ ఇంక్. ను కొనుగోలు చేసినప్పటి నుంచి అందుకు సంబందించిన ప్రతి అంశము వార్తల్లో నిలుస్తూనే ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రోద్బలంతోనే ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశారంటూ తాజాగా మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఎలాన్ మస్క్ కంటే ముందే ట్విట్టర్ ను కొనుగోలు చేయాలంటూ గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఆదేశించాడని మాజీ ప్రతినిధి డెవిన్ నున్స్ తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను అరికట్టి, నిజాయితీని నిలబెట్టాలని ఉద్దేశంతోనే ట్రంప్ ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నారని ఒక అంతర్జాతీయ మీడియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డెవిన్ చెప్పుకొచ్చారు.

Also Read:Gas Cylinder Price: సామాన్యుడిపై మరోభారం.. పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర..

అయితే అప్పటికి అది సాధ్యపడకపోగా..ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ట్రంప్ ఖాతాను తొలగించింది ట్విట్టర్. దీంతో ట్విట్టర్ పై పగ పెంచుకున్న డోనాల్డ్ ట్రంప్..తనకు సన్నిహితుడైన మస్క్ ద్వారా ట్విట్టర్ ను కొనేలా ప్రేరేపించారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన టెస్లా అధినేత మస్క్..ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని వెల్లడించారు.

ఈ విషయంపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన మస్క్..”ఇది అబద్ధం. ట్రంప్‌తో నాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. పైగా తాను ప్రత్యేకంగా ‘ట్రూత్ సోషల్‌లో’ ఉంటానని బహిరంగంగా ప్రకటించాడు” అంటూ ట్వీట్ చేశారు. ట్విట్టర్ కు ధీటుగా డోనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ అనే యాప్ ను తీసుకువచ్చారు. అయితే ట్రంప్ సోషల్ మీడియా యాప్ గా పిలిచే ట్రూత్ సోషల్ పైనా మస్క్ ఇటీవల విమర్శలు గుప్పించడం గమనార్హం.

Also read:Imran Khan: తనను తాను గాడిదతో పోల్చుకున్న ఇమ్రాన్.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో..