Gas Cylinder Price: సామాన్యుడిపై మరోభారం.. పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర..

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య, పేదవర్గాల ప్రజలపై మరోభారం పడింది. వంట గ్యాస్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు ఉదయాన్నే

Gas Cylinder Price: సామాన్యుడిపై మరోభారం.. పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర..

Lpg Cylinder Price

Gas Cylinder Price: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య, పేదవర్గాల ప్రజలపై మరోభారం పడింది. వంట గ్యాస్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు ఉదయాన్నే సామాన్యులకు షాక్ ఇచ్చాయి. గృహ వినియోగ గ్యాస్ సిలీండర్ ధర రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా పెరిగిన ధరతో సిలిండర్ ధర రూ. 1052కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి.

Commercial LPG cylinder Price : గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది.. ఈరోజు నుంచే కొత్త రేట్లు..!

ఇప్పటికే నిత్యావసర వస్తువుల పెరుగుదలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదవర్గాల ప్రజలకు కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఈ క్రమంలో పేద వర్గాలుసైతం అధికంగా వినియోగించే వంట గ్యాస్ సిలీండర్ ధరలు పెరగడం వారికి పెనుభారంగా మారనుంది. గత కొద్దిరోజుల క్రితమే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర పెరిగిన విషయం విషయం విధితమే. దీంతో మే1 నుంచి హైదరాబాద్ లో వాణిజ్య సిలీండర్ ధర రూ. 2,460 నుంచి రూ. 2,563.50కి చేరింది.