Facebook Pay వచ్చేసింది: వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కూడా డబ్బులు పంపేయొచ్చు

Facebook కొత్త పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న యూజర్లకు తీపి కబురుచెప్పింది. ఒకేసారి వాట్సప్, Facebook మెసేంజర్, ఇన్‌స్టాగ్రామ్‌ల యూజర్లకు ఇది వాడుకునే సౌకర్యం కల్పించింది. వీటి సహాయంతో స్నేహితులకు డబ్బులు పంపుకోవచ్చు, గిఫ్టులు పంపొచ్చు, విరాళాలు ఇవ్వొచ్చు. 

ఇప్పటివరకూ మార్కెట్ లో ఉన్న అన్నీ డిజిటల్ వాలెట్ల మాదిరిగానే ఫేస్‌బుక్ పే వచ్చినప్పటికీ వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉండటంతో దీనికి భారీగా స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. గతంలో వచ్చిన ఫేస్ బుక్ సెక్యూరిటీ లోపాలను అధిగమిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే క్రిప్టో కరెన్సీని అందుబాటులోకి తీసుకొచ్చారు. 

ప్రస్తుతం అమెరికాలోని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఫేస్‌బుక్ పే సర్వీస్ త్వరలోనే భారత్ లోకి తీసుకురానున్నారు. అకౌంట్ లింక్ అప్ చేసుకున్న తర్వాత లేదా, క్రెడిట్(డెబిట్) ఏదైనా కార్డు యాడ్ చేసుకున్న తర్వాత ఫేస్ బుక్ యాప్ నుంచి ట్రాన్సాక్షన్ జరుపుకోవచ్చు. ఇలా నగదు లావాదేవీలు జరిపిన హిస్టరీని కూడా తర్వాత చూసుకోవచ్చు.