కోవిడ్ – 19 (కరోనా) పిశాచాన్ని తరిమికొట్టడానికి చైనా చాలా త్యాగాలు చేస్తోంది. కరోనాను అంతమొందించడానికి నర్సులు చేసిన త్యాగం అందర్నీ కలిచివేస్తోంది. సాహసోపేతంగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. వైరస్ వ్యాపించకుండా ఎన్నో చర్యలు తీసుకొంటోంది. సమయం అనేది లెక్క చేయకుండా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరు పనిచేస్తుండడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
తాజాగా..చైనాలోని నర్సులు తమ వెంట్రుకలను సైతం తొలగించుకుంటున్నారు. వెంట్రుకల ద్వారా వైరస్ వ్యాపిస్తుందనే అనుమానంతో నున్నగా గుండులు చేయించుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపేస్తున్నాయి. చైనాలోని వూహాన్‌లో పుట్టిన వైరస్ వందలాది మందిని కబళించి వేసింది. 1100 మంది చనిపోయినట్లు అంచనా. వేలాది మంది వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.
నర్సులు, వైద్యులు అహర్నిశలు వైద్య చికిత్స అందిస్తున్నారు. తల నుంచి సహజసిద్ధంగా రాలే వెంట్రుకల నుంచి వైరస్ వ్యాపిస్తుందనే అనుమానంతో..నర్సులు శిరోజాలను తొలగించుకొనేందుకు ముందుకు వస్తున్నారు. కొంతమంది పూర్తిగా వెంట్రుకలను తీసివేయగా..మరికొంత మంది వెనుక, ముందు భాగంలో ఉన్న వెంట్రుకలను తీయించి వేసుకంటున్నారు.
* కోవిడ్ – 19 వైరస్ కారణంగా వీధులన్నీ నిర్మానుష్యం అయిపోతున్నాయి.
* బయటకు వచ్చేందుకు జనాలు భయపడిపోతున్నారు.
* అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.
* అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా..ఇప్పుడు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది.
* షాంఘై నగర పరిధిలోని లిజియాజుయి రోడ్లన్నీ బోసిపోయాయి.
* జియుజియాంగ్‌లోని షాపింగ్ వీధులు కళతప్పాయి.
* ఎన్నో ఆసుపత్రులను నిర్మించి చైనా ప్రభుత్వం. ఓ ఎగ్జిబీషన్ సెంటర్‌లో మంచాలు వేసి ఆసుపత్రిగా మార్చేసింది.
Respect! A team of nurses in NW China’s Shaanxi shaved their hair before coming in for duty amid coronavirus outbreak to avoid cross-infection. pic.twitter.com/XpseMgSsg9
— People’s Daily, China (@PDChina) February 6, 2020