Japan Road Acident: జపాన్ లో బస్సు, ట్రక్కు ఢీ, ఐదుగురి మృతి

జపాన్ దేశంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.జపాన్‌ దేశ హక్కైడో పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మరణించారు....

  • Published On : June 19, 2023 / 06:36 AM IST

జపాన్ దేశంలో బస్సును ఢీకొన్న ట్రక్కు

Japan Road Acident: జపాన్ దేశంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.జపాన్‌ దేశ హక్కైడో పట్టణంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మరణించారు.(Five people killed) ఐదుగురు మృతుల్లో బస్సు, ట్రక్కు డ్రైవర్లతో పాటు బస్సులోని ప్రయాణికులు కూడా ఉన్నారు.ఇంటర్‌సిటీ హైవే బస్సు 15 మంది ప్రయాణికులను సపోరో నుంచి హకోడేట్ నగరంలోని హాట్ స్ప్రింగ్ రిసార్ట్‌కు తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.(bus, truck collided in Japan)

Mass Shooting At Music Festival: యూఎస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో కాల్పులు, ఇద్దరి మృతి, ముగ్గురికి గాయాలు

15 మంది ప్రయాణికుల్లో ముగ్గురు మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవరు టకయుకి కోజెన్ కు 15 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉందని, ఆయన ఎప్పుడూ ప్రమాదాలు చేయలేదని జపాన్ అధికారులు చెప్పారు. ట్రక్కు డ్రైవర్ కు డ్రైవింగులో అనుభవం ఉందని హకోడేట్ నుంచి యకుమో వధశాలకు పందులను ట్రక్కులో తీసుకవెళుతుండగా, ఈ ప్రమాదం జరిగిందని జపాన్ అధికారులు చెప్పారు.