ఇండోనేషియాలో గత కొన్ని రోజుల నుంచి ఏక ధాటిగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలకు తోడు కొండ చరియలు విరిగి పడుతుండటంలో 29 మంది మరణించారు. మరో 13 మంది ఆచూకీ గల్లంతైయ్యారు. దీన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
సమత్రా దీవిలోని బెంగ్‌కులుతోపాటు లాంపంగ్ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు తోడు కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవ సమాధి అయ్యారు. వర్షాలతో పోటెత్తిన బెంగ్‌కులు పరిధిలోని వందల ఇండ్లు, వంతెనలు నీట మునిగిపోగా, రోడ్డు దెబ్బ తిన్నాయి. దీంతో ఆయా పరిధిలో నివసిస్తున్న 12వేల మంది ప్రజలకు అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రాజధాని జకార్తా నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో పోటెత్తిన వరదలకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. బెంగ్‌కులులోని తెంగాహ్ జిల్లాలో మరో 22 మంది మరణించారు. కాగా అక్రమ బొగ్గు మైనింగ్ లు దీనికి తోడు వరదలు వెరసి ఆయా ప్రాంతాలలోని కొండ చరియలు విరిగిపడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ తవ్వకాలతో అడవులు కూడా ధ్వంసమైపోతున్నాయి. ఈ అక్రమ మైనింగ్ తవ్వకాల వల్లనే పలు విపత్తులకు దారి తీస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.