KP Sharma Oli Arrested : నేపాల్‌ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్.. 10ఏళ్లు జైలుశిక్ష తప్పదా..? అరెస్టుకు కారణాలివే..

KP Sharma Oli Arrested : నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని పోలీసులు అరెస్టు చేశారు.

KP Sharma Oli Arrested

  • నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
  • భక్తపూర్‌లోని నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కక్షపూరిత చర్యగా అభివర్ణించిన ఓలీ
  • న్యాయపోరాటం చేస్తానని వెల్లడి

KP Sharma Oli Arrested : నేపాల్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శుక్రవారం నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేశారు. తన ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామచంద్ర పౌదెల్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే, నూతన ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మురుసటి రోజే.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్ అయ్యారు.

Andhrapradesh : ఏపీలో దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను చంపేసి.. పెరట్లో పాతిపెట్టిన భార్య.. ఆ ఒక్క తప్పుతో దొరికిపోయింది..

భారీ భద్రత మధ్య భక్తపుర్‌లో ఉన్న కేపీ శర్మ ఓలీని పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది దేశంలో జరిగిన జెన్‌జీ నిరసనలను హింసాత్మకంగా అణచివేశారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పోలీసుల తీసుకెళ్తున్న సమయంలో కేపీ శర్మ ఓలీ మీడియాతో మాట్లాడుతూ.. ఇది కక్షపూరిత చర్యగా అభివర్ణించారు. న్యాయపోరాటం చేస్తామని అన్నారు.

మాజీ ప్రధాని అరెస్టును కొత్త హోం వ్యవహారాల శాఖ మంత్రి సుడాన్ గురంగ్ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాజీ హోం మంత్రి రమేశ్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అయితే, ఇది ప్రతీకార చర్య కాదని, న్యాయ ప్రక్రియకు వీరి అరెస్టు ఆరంభం అంటూ సుడాన్ గురంగ్ పేర్కొన్నారు.

గతేడాది సెప్టెంబరులో జరిగిన జెన్ జీ ఆందోళనల్లో 19మంది యువకులు సహా 70మంది ప్రాణాలు కోల్పోయారు. 2వేల మందికిపైగా గాయపడ్డారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా నేపాలీ యువత ఈ ఉద్యమం చేపట్టింది. అంతేకాదు.. సోషల్ మీడియాపై నిషేధం విధించడం వంటి చర్యలు ప్రభుత్వంపై మరింత వ్యతిరేకతను పెంచాయి. దీనిని వ్యతిరేకిస్తూ గతేడాది సెప్టెంబర్‌లో మొదలైన నిరసనలు క్రమంగా అవినీతి ఉద్యమంగా మారింది. చివరకు ప్రభుత్వం కూలిపోయి రాజకీయ సంక్షోభం ఏర్పడింది.

నాలుగుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) నాయకుడైన ఓలీపై విచారణ జరపాలని నేపాల్‌లోని ఒక ఉన్నత స్థాయి కమిషన్ సిఫార్సు చేసిన తర్వాత ఆయన అరెస్టు జరిగింది.అయితే, జెన్‌ జీ ఉద్యమంపై ఉన్నతస్థాయి కమిషన్‌ దర్యాప్తు జరిపింది. కమిషన్ సిఫార్సు ఆధారంగా కోర్టు విచారణలో వీరు దోషులుగా తేలితే.. 10ఏళ్ల వరకు జైలు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.