French President : ఫ్రాన్స్ అధ్యక్షుడిపై “కోడిగుడ్డు”దాడి
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పై ఓ వ్యక్తి కోడిగుడ్డు విసిరాడు. సోమవారం లియాన్ సిటీలో అంతర్జాతీయ క్యాటరింగ్, హోటల్ మరియు ఫుడ్ ట్రేడ్ ఫెయిర్ (SIRHA)ను మాక్రాన్
- venkaiahnaidu
- Published On : September 27, 2021 / 08:03 PM IST
Macron
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పై ఓ వ్యక్తి కోడిగుడ్డు విసిరాడు. సోమవారం లియాన్ సిటీలో అంతర్జాతీయ క్యాటరింగ్, హోటల్ మరియు ఫుడ్ ట్రేడ్ ఫెయిర్ (SIRHA)ను మాక్రాన్ సందర్శిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ ఉడికించిన కోడిగుడ్డు మాక్రాన్ భుజం తగిలి కిందపడిపోయింది.
క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే రెస్టారెంట్ టిప్స్ పై ఇక పన్ను విధించబడదని అధ్యక్షుడు తాజాగా ప్రకటించిన తర్వాత, ఫెయిర్ అటెండెన్స్‌తో సాదరంగా స్వాగతం అందుకున్న తర్వాత మేక్రాన్ కి ఈ చేదు అనుభవం ఎదురైంది. దుండగుడిని వెంటనే భద్రతాసిబ్బంది పట్టకుని ఆ రూమ్ నుంచి బయటకి తీసుకెళ్లారు. అయితే తనపైకి గుడ్డు ఎందుకు విసరాల్సి వచ్చింది ఆ వ్యక్తిని కలిసి అడిగి తెలుసుకుంటానని అధ్యక్షుడు మాక్రాన్ చెప్పారు.
ఫ్రెంచ్ లో ఆగ్రహించిన నిరసనకారుల రాజకీయనాయకులపైకి గుడ్లు విసరడం ఒక సాధారణ వృత్తిపరమైన ప్రమాదంగా ఉంది. మాక్రాన్ దీనికి మినహాయింపు కాదు. 2017లో మాక్రాన్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఉన్నప్పుడు, పారిస్‌లోని జాతీయ వ్యవసాయ మేళాలో జన సందర్శన సమయంలో ఓ వ్యక్తి విసిరిన గుడ్డు మాక్రాన్ తలపై పగిలింది. ఇక, ఇటీవల, జూన్‌లో వాలెన్స్ సిటీలో ఒక వ్యక్తి మాక్రాన్ ముఖం మీద చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే.
Either @EmmanuelMacron is protected by an invisible shield or someone just threw a boiled egg. pic.twitter.com/JTf5fZsAMf
— ??? ?????? ??? ™️ (@TheMarketDog) September 27, 2021
