బ్రిటన్ : చుక్ చుక్ రైల్ వస్తోంది..దూరం దూరం జరగండి అంటు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ రైలుబండిని చూడగానే గుర్తుకొస్తాయి. ఒకప్పుడు ఈ రైలుబండి (పొగబండి అనేవారు) వస్తే ప్రజలు ఆసక్తిగా, చిత్రంగా చూసేవారు. కాలం మారింది, పొగబండి కాస్తా కరెంట్ తో పరుగులు పెడుతోంది. ఇంకా సౌకర్యంగా ఆకాశంలో వెళ్తున్నట్లుగా పిల్లర్స్ మీద మెట్రో పరుగులు పెడుతున్నాయి. అంతకంటే వేగంగా బుల్లెట్ ట్రైన్స్ వచ్చేసాయి. కానీ మనిషి మేథస్సు ఎప్పటికీ ఏదో కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటుంది. డీజిల్,విద్యుత్ వినియోగంతో పర్యావరణానికి హానీ కలగకుండా..అత్యంత కంఫర్ట్ గా ట్రైన్ జర్నీ కోసం ‘బ్రీజ్’ ట్రైన్స్ వినియోగంలోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. దీంతో భవిష్యత్తు అంతా బ్రీజ్ ట్రైన్స్ దే నంటున్నారు స్పెషలిస్టులు.
దూర ప్రయాణాలకు బసెస్, కార్స్ కంటే ట్రైన్ జర్నీకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటాం. కానీ ట్రైన్ నడపాలంటే డీజిల్ లేదా విద్యుత్ వినియోగం ఎక్కువగా వుంటుంది. పైగా డీజిల్ ట్రైన్ తో పర్యావరణానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అలాగే విద్యుత్ ఉత్పత్తి ప్రాసెస్ కూడా పర్యావరణ సమస్యలు కూడా వున్నాయి. అందుకే భవిష్యత్తు బ్రీజ్ రైళ్లదే అంటున్నారు స్పెషలిస్టులు.
బ్రీజ్ ట్రైన్స్ స్పెషల్
ప్రస్తుత ట్రైన్స్ లా బ్రీజ్ ట్రైన్స్ కు డీజిల్ అక్కర్లేదు, కరెంటు అవసరం ఉండదు. హైడ్రోజన్, ఆక్సిజన్ మిశ్రమమే ఈ బ్రీజ్ ట్రైన్ ఇంధనం. అంతేకాదు శబ్దకాలుష్యం కూడా వుండదు.విద్యుత్ ఇంజన్ల కోసం ప్రస్తుతం పట్టాల వెంబడి విద్యుద్దీకరణకు చేస్తున్న కోట్ల ఖర్చు కూడా మిగులుతుంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఈ కొత్త తరహా లోకోమోటివ్‌కు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. ఫ్రెంచ్ కంపెనీ ఆల్‌స్టం ఈ ఇంజన్ ను అభివృద్ధి చేస్తోంది.
అంతా సవ్యంగా జరిగితే 2021 కల్లా 100 బ్రీజ్ ట్రైన్స్ ఇంజన్లు తయారు చేయాన్నది ఫ్రెంచ్ కంపెనీ ఆల్‌స్టం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇంజన్ కు కావాల్సిన ఇంధనం హైడ్రోజన్. ఒక సింగిల్ ట్యాంక్ హైడ్రోజన్ ట్యాంక్‌తో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ 1000 కిలోమీటర్లు ప్రయాణించే సామర్ధ్యం వుంటుంది. కొత్త రైలును తయారు చేయడానికి కాస్ట్ ఎక్కువ అవుతుండటంతో అల్‌స్టం అధికారులు బ్రిటన్‌లో వినియోగంలో ఉన్న విద్యుత్ ఇంజిన్లనే బ్రీజ్ ఇంజన్లుగా మార్చేస్తున్నారు. బ్రీజ్ ఇంజన్‌తో రైళ్లు పట్టాలపై పరిగెత్తడం ప్రారంభమైతే పర్యావరణానికి హాని కలగదు సరికదా..ప్యాసింజెర్స్ కూడా తక్కువ సయమంలోనే కంఫర్టబుల్ గా ప్రయాణించ అవకాశం వుటుందని బ్రిటన్ రైల్వే మంత్రి ఆండ్రూ జోన్స్ తెలిపారు.