చలికాలం మంచు సాధారణమే. దానితో పాటు రాత్రి సమయం కంటే పగటి సమయం తక్కువ ఉండటం కూడా మామూలే. ఏడాదిలో ఓ సారి వచ్చే చలికాలంలో కేవలం ఈ ఒక్కరోజే పగటి సమయం తక్కువగా ఉంటుందట. డిసెంబరు 22ఆదివారం పగటి సమయం తక్కువగా ఉంటుందని గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌తో దర్శనమిచ్చింది.
ఒక్కో అర్ధ గోళం మారినప్పుడూ ఒక్కోసారి ఇలా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. భూమి ఉత్తరార్ధగోళంలో ఉన్నప్పుడు డిసెంబరులోనూ, దక్షిణార్ధగోళంలో ఉన్నప్పుడు జూన్‌లోనూ అయనాంతాలు ఏర్పడతాయి. వీటి ద్వారానే కాలాలు నిర్ణయిస్తారు. గూగుల్ కథనం ప్రకారం.. డిసెంబరు 22 ఆదివారం నుంచి 2020 మార్చి 20 శుక్రవారం వరకూ చలికాలం అని నిర్దారించింది.
కొన్ని వందల సంవత్సరాలుగా దీనిని ఆస్ట్రానామికల్ మైల్‌స్టోన్‌గా ప్రపంచస్థాయిలో సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. చలికాలం ఆరంభాన్ని యూదులు టెకుఫట్ టెవెట్ అని, ఈజిప్టులు ఐసీస్ దేవత కొడుకు హారస్ పుట్టినరోజు అని 12రోజుల పాటు జరుపుకుంటారు. చైనాలో కుటుంబాలు అంతా ఒకచోట కలిసి విందు భోజనం చేసి సెలబ్రేట్ చేసుకుంటారు.
చలికాలం ఉదయాన్నే పడే సూర్యుని కిరణాలను కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇంగ్లాండ్‌లో గ్లాస్టన్‌బరీ టార్, మెక్సికోలో చిచెన్ ఇజా, జర్మనీలో గోసెక్ సర్కిల్, ఈజిప్టులో కర్నాక్ టెంపుల్, ఇంగ్లాండ్ లో న్యూగ్రాంజ్ లలో ఈ ఉత్సవాలు ప్రత్యేకం. భారత్‌లో డిసెంబరు 22 ఉదయం 3గంటల 53నిమిషాల నుంచి శీతాకాలం మొదలైనట్లన్నమాట.