plastic soaps
Plastic Soaps America : ఇకపై ప్లాస్టిక్ సబ్బులు అందుబాటులోకి రానున్నాయి. ప్లాస్టిక్ సబ్బులేంటని ఆశ్చర్యపోతున్నారా ఇది నిజం. ప్లాస్టిక్ తో సబ్బులను తయారు చేస్తున్నట్టు అమెరికాలోని వర్జినీయా టెక్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గులియాంగ్ లియు పేర్కొన్నారు. భూమిపై గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ మానవాళికి పెను సవాలుగా మారుతోంది.
ఈ సమస్యకు గులియాంగ్ లియు వినూత్నమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్లాస్టిక్ పదార్థాలు సబ్బుల తయారీలో వినియోగించే ఫ్యాటీ యాసిడ్ ను పోలి ఉంటాయని గులియాంగ్ లియు గుర్తించారు. ఈ రెండింటి మధ్య పరిమాణంలో మాత్రమే తేడా ఉంటుంది. ప్లాస్టిక్ ను మండించేందుకు ఓ ఒవెన్ లాంటి పెద్ద రియాక్టర్ ను శాస్త్రవేత్తల బృందం రూపొందించింది.
Diabetes : ఈ ఆహారాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయట ! అవేంటో తెలుసా ?
పాలిథిన్ ను అణువులుగా విడగొట్టేందుకు వీలుగా దీని కింది భాగంలో ఎక్కువ వేడి వచ్చేలా, పై భాగంలో చల్లదనం ఉండేలా రియాక్టర్ ను తయారు చేశారు. ఈ రియాక్టర్ సాయంతో పాలిథిన్ ను ఫ్యాటీ యాసిడ్లుగా మార్చారు. ప్లాస్టిక్ ను మండించగా వచ్చిన మైనం లాంటి పదార్థంతో సబ్బులు తయారు చేశారు.