×
Ad

ధాయిలాండ్‌లో దారుణం.. డేకేర్ సెంటర్‌లో కాల్పులు.. 22 మంది పిల్లలు సహా 34 మంది..

సమాచారం అందుకున్న అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. స్కూల్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

  • Published On : February 11, 2026 / 06:00 PM IST

Gun Firing Representative Image (Image Credit To Original Source)

  • గన్ తో స్కూల్ లోకి చొరబాటు
  • విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు
  • సిబ్బందిని బందీగా చేసుకోవడంతో టెన్షన్

Thailand Gunfire: దక్షిణ థాయ్ నగరం హాట్ యాయ్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ప్రథాన్ ఖిరివాట్ స్కూల్ లో బుధవారం మధ్యాహ్నం కాల్పులు చోటు చేసుకున్నాయి. మాజీ అధికారి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 34 మంది చనిపోయారు. మృతుల్లో 22 మంది పిల్లలు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. పటాంగ్ సబ్ డిస్ట్రిక్ట్‌లోని థెట్సాబన్ 31 రోడ్‌లో కాల్పులు జరిగాయి.

అనుమానితుడిని ఖేమ్ గా పోలీసులు గుర్తించారు. స్కూల్ కి సమీపంలోనే ఉండే ఇంట్లో ఖేమ్ నివాసం ఉంటున్నాడు. అతడు తన తల్లికి హాని కలిగించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అతడిది హింసాత్మక ప్రవర్తన అని తెలుసుకున్నారు. ఖేమ్ తన తల్లితో గొడవ గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఖేమ్ పోలీస్ అధికారుల నుండి M4 రైఫిల్‌ను లాగేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. దగ్గరలోని స్కూల్ మైదానంలోకి చొరబడ్డాడు. అక్కడ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. స్కూల్ లో తన చెల్లిని క్రమశిక్షణలో ఉంచేందుకు ప్రయత్నించిన టీచర్ ని అతడు లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కాల్పులు జరిపాక ఖేమ్ స్కూల్ భవనంలోకి చొరబడ్డాడు. సిబ్బందిని బందీగా చేసుకున్నాడు. సమాచారం అందుకున్న అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. స్కూల్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఉద్రిక్త పరిస్థితులు తగ్గే వరకు స్కూల్ కి దూరంగా ఉండాలని సిబ్బందిని, స్థానికులను పోలీసులు కోరారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర వైద్య బృందాలను పంపించారు. ఈ కాల్పుల ఘటన దక్షిణ థాయిలాండ్‌లోని స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. స్కూల్ పిల్లల భద్రత ఆందోళన కలిగిస్తోంది.

Also Read: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి ఇళ్లల్లో దొంగతనాలు.. బీఎండబ్ల్యూ కారు, నగలు, అల్మారాలో డబ్బులు.. అబ్బో..