Mexico : కాల్పుల కలకలం.. ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు సహా 10మంది మృతి.. పదుల సంఖ్యలో గాయాలు..
Mexico : మెక్సికోలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10మంది మృతి చెందారు. మృతుల్లో వీరిలో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు సహా 10మంది ఉన్నారు.
- Harish Thanniru
- Published on- May 18, 2026 / 06:50 AM IST
Mexico
Mexico : మెక్సికోలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10మంది మృతి చెందారు. మృతుల్లో వీరిలో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు సహా 10మంది ఉన్నారు. అక్కడి కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్‌విట్టింగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఘటనలో పదుల సంఖ్యలో స్థానికులు గాయపడ్డారు. వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ కాల్పుల వెనుక కారణం తెలియరాలేదు. దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది.
