Haiti Quake Survivors: ఆకలితో విలపిస్తూ ప్రాణాలు కోల్పోతున్న హైతీ భూకంప బాధితులు

హైతీలో జరిగిన ప్రకృతి బీభత్సం కారణంగా ప్రాణ నష్టం... ఆస్తి నష్టం తర్వాత అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు.

Haiti quake survivors: హైతీలో జరిగిన ప్రకృతి బీభత్సం కారణంగా ప్రాణ నష్టం… ఆస్తి నష్టం తర్వాత అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఆహారం, వసతి, ఆరోగ్య సదుపాయం కరువై వెయ్యి 941మంది చనిపోయినట్లు రీసెంట్ గా జరిపిన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ లో తెలిసింది. తుఫాన్ వచ్చి కరేబియన్ దేశాన్ని వర్షం, భయంకరమైన వరద ధాటితో తీవ్ర నష్టానికి గురిచేసింది.

పలు మేజర్ హాస్పిటల్స్ దెబ్బతినడంతో కాపాడేవారు కరువయ్యారు. టెంట్స్ వేసి తీవ్రంగా గాయపడే వారిని రక్షించాలని చికిత్స చేస్తున్నారు. అయినప్పటికీ చిన్నారులు, వృద్ధుల ప్రాణాలని కాపాడలేకపోతున్నారు.

సరిపడ డాక్టర్లు లేక ప్రాణాలు కోల్పోయిందని న్యూయెల్ శవం పక్కనే నిల్చొని విలపిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన న్యూయెల్.. హయాతిలో జరిగిన రిక్టార్ స్కేలుపై 7.2 పాయింట్ల భూకంప తీవ్రతకు ఆ ప్రాంతం బాగా నష్టపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యానికి బాగా నష్టపోయిన ప్రాంతాల్లో లెస్ కేయిస్ (Les Cayes) ఒకటి.

నిన్నటి మధ్యాహ్నమే ఆమెను ఇక్కడకు తీసుకొచ్చాం. ఈరోజు ఉదయమే చనిపోయింది. ఏమీ చేయలేకపోయామని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది.

శనివారం జరిగిన ఈ భూకంపం పదివేలకు పైగా ప్రాణనష్టం కలిగించిన 11ఏళ్ల క్రితం ఘటనను గుర్తు చేస్తుంది. ఇటీవలే జరిగిన ఘటనతో కనీసం 9వేల 915మంది చనిపోయినట్లుగా కన్ఫామ్ అయింది. చాలా మంది ఇప్పటికీ ఆచూకీ తెలియకుండానే ఉన్నారని సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్ చెప్తుంది.

గత నెల 7న హైతీ దేశ అధ్యక్షుడు జొవెనెల్‌ మోయిస్‌ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ఇప్పటికీ ఆ దేశం షాక్‌లో ఉండగా.. భూకంపం మరింత విషాదంలోకి నెట్టింది. ‘

ట్రెండింగ్ వార్తలు