Iran Unrest: ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు.. వెంటనే

ఏదైనా సాయం కోసం ఫోన్ నెంబర్లు(+989128109115, +989128109109), మెయిల్ లో(cons.tehran@mea.gov.in) సంప్రదించాలని సూచించింది. ఎంబసీతో రిజిస్ట్రర్ కాని వారు అధికారిక సైట్ లో రిజిస్టర్ కావాలని సూచించింది.

Iran Unrest: ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్తతలు.. భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు.. వెంటనే

Iran Unrest Representative Image (Image Credit To Original Source)

Updated On : January 14, 2026 / 7:22 PM IST
  • ఇరాన్ లో మారణహోమం
  • భద్రతా దళాల కాల్పుల్లో 2వేల 500 మృతి
  • వెంటనే ఇరాన్ ను వీడాలని భారతీయులకు సూచన

Iran Unrest: ఇరాన్ లో ఉద్రిక్తతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులను అణిచివేసేందుకు భద్రతా దళాలు జరుపుతున్న కాల్పుల్లో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 2వేల 500 దాటింది.

హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఇరాన్ లో ఉంటున్న భారతీయులకు కీలక సూచనలు చేసింది. వెంటనే ఇరాన్ ను వీడాలని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలని, ఎంబసీతో కాంటాక్ట్ లో ఉండాలని తెలిపింది.

విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు సహా భారతీయులందరూ కమర్షియల్ విమానాలు సహా అందుబాటులో ఉన్న మార్గాలను ఉపయోగించి దేశం విడిచి వెళ్లాలని కోరింది. ఏదైనా సాయం కోసం ఫోన్ నెంబర్లు(+989128109115, +989128109109), మెయిల్ లో(cons.tehran@mea.gov.in) సంప్రదించాలని సూచించింది. ఎంబసీతో రిజిస్ట్రర్ కాని వారు అధికారిక సైట్ లో రిజిస్టర్ కావాలని సూచించింది.

ఇరాన్ లో పరిస్థితులు మరింత దిగజారాయి. వారాల తరబడి జరుగుతున్న నిరసనలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలగజేసుకున్నారు. ఇరాన్ లోని ఆందోళనకారులు ఆయన తన మద్దతు ప్రకటించారు. వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. సంస్థలను స్వాధీనం చేసుకోవాలన్నారు. అవసరమైతే తమ సాయం ఉంటుందని ప్రకటించారు.

మరోవైపు, నిరసనకారులను రెచ్చగొట్టడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ దేశాన్ని అస్థిరపరుస్తున్నాయని ఇరాన్ అధికారులు ఆరోపించారు. మరణాలకు ఉగ్రవాదులే కారణం అన్నారు.

నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండండి..

ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ లోని ఇండియన్ ఎంబసీ అలర్ట్ అయ్యింది. భారతీయులకు పలు జాగ్రత్తలు చెప్పింది. నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. ఏదైనా అవసరమైతే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలంది. ప్రయాణ గుర్తింపు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలంది. స్థానిక పరిణామాలను నిత్యం పర్యవేక్షించాలని కోరింది. రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోని వారు వీలైనంత త్వరగా చేయాలని కోరింది. సాయం కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్లు, ఇమెయిల్ వివరాలు ఇచ్చింది.

ట్రావెల్ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి..

“ఇరాన్‌లోని భారతీయ పౌరులు తమ ప్రయాణ, వలస పత్రాలు, పాస్‌పోర్ట్‌లు, ID లు తక్షణమే అందుబాటులో ఉంచుకోవాలి. ఈ విషయంలో ఏదైనా సాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. భారతీయ పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి” అని ఇరాన్ లోని ఇండియన్ ఎంబసీ సలహా ఇచ్చింది.

ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడం కారణంగా ఇరాన్ లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ప్రజా నిరసనలు 20వ రోజుకి చేరాయి. దేశవ్యాప్తంగా దాదాపు 280 ప్రదేశాలలో తీవ్రమైన ఘర్షణలకు దారితీశాయి.

Also Read: కొత్త యాప్.. పిచ్చ పిచ్చగా డౌన్‌లోడ్ చేస్తున్న జనం.. డబ్బులు ఎదురిచ్చి..