Hamas releases
Hamas releases : హమాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. గాజా స్ట్రిప్‌లో ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసినట్లు హమాస్ సోమవారం ప్రకటించింది. వృద్ధ బందీలను మానవతా దృక్పథంతో విడుదల చేసినట్లు పాలస్తీనా సమూహం హమాస్ తెలిపింది. బందీల ఆరోగ్య కారణాల దృష్ట్యా మానవతా దృక్పథంతో ఇద్దరిని విడుదల చేసినట్లు హమాస్ ప్రకటన తెలిపింది. విడుదలైన బందీలను నురిట్ కూపర్ (79), యోచెవెద్ లిఫ్‌షిట్జ్ (85)గా స్థానిక మీడియా గుర్తించింది.
Also Read : Viral Video : షాకింగ్ వీడియో… కుప్పకూలిన మరో బ్రిడ్జి, ముగ్గురు మృతి, తప్పించుకుందామని చూసినా…
గాజా సరిహద్దు సమీపంలోని నిర్ ఓజ్‌లోని కిబ్బత్జ్‌లో మహిళలు, వారి భర్తలను వారి ఇళ్ల నుంచి బందీలుగా పట్టుకున్నారు. వారి భర్తలను మాత్రం విడుదల చేయలేదు. బందీల విడుదలపై ఇజ్రాయెల్ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బందీల విడుదల చేయడానికి రెడ్ క్రాస్ చర్యలు తీసుకుంది. విడుదలైన బందీలు ఈజిప్షియన్ రాఫా క్రాసింగ్ వద్దకు చేరుకున్నారని ఈజిప్టు వార్తా సంస్థ సోమవారం ఆలస్యంగా నివేదించింది.
Also Read : CM KCR : టార్గెట్ కాంగ్రెస్.. హస్తం పార్టీని కట్టడి చేసేలా కేసీఆర్ వ్యూహం
హమాస్ ముష్కరులు అక్టోబరు 7న సరిహద్దు దాడి చేసిన రెండు వారాల తర్వాత శుక్రవారం అమెరికా తల్లి, కుమార్తె జుడిత్, నటాలీ రానన్‌లను హమాస్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ సైన్యం అంచనా ప్రకారం 220 మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చెరలో ఉన్నారు. హమాస్ చెరలో ఉన్న బందీలను విడుదల చేయాలని యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్ కోరారు. ఇజ్రాయెల్ సోమవారం గాజాపై వైమానిక దాడులను ముమ్మరం చేసింది. గత 24 గంటల్లో జరిగిన బాంబు దాడుల్లో 436 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.