భారత 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశమంతటా సగర్వంగా, ఘనంగా జరుపుకున్నారు. గల్లీ నుంచి మొదలై ఢిల్లీ వీధులలోనే కాదు దేశ దశదిశలా త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.అందరిలా కాకుండా సరిహద్దుల్లోని సైనికులు మాత్రం జెండా వందనాన్ని ఆనవాయితీగా.. సాంప్రదాయబద్దంగానే కాకుండా ప్రాణాలకు పణంగా పెట్టి ఎగురవేశారు బోర్డర్ సైనికులు. రేయింబవళ్లు నిద్రాహారాలు పట్టించుకోకుండా వాతావరణ పరిస్థితులను తట్టకుంటూ దేశ భద్రతకు కష్టపడే సైనికులు జెండా వందనాన్ని కూడా అదే తీవ్ర పరిస్థితుల మధ్య జరుపుకున్నారు.
ఇండో టిబెటెన్ బోర్డర్ పోలీస్(ITBP) జెండాను ఎగురేసిన ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. సియాచిన్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న లడఖ్ ప్రాంతం సాధారణంగానే 18వేల అడుగుల ఎత్తులో ఎముకలు కొరికే చలి మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడి ఉంటుంది. అటువంటి వాతావరణంలోనూ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.
#लद्दाख में 18 हजार फीट की ऊंचाई पर हिमवीरों ने -30 डिग्री तापमान में मनाया #गणतंत्रदिवस । #RepublicDayIndia #RDayWithAIR
Video: @ITBP_official pic.twitter.com/l7DIEBhDdD— आकाशवाणी समाचार (@AIRNewsHindi) January 26, 2019
అనంతరం జెండా వందనం సమర్పిస్తూ భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. దాంతో పాటుగా ఇండో-చైనా బోర్డర్ ఉత్తరాఖాండ్ ప్రాంతంలో నాలుగు అడుగుల మేర మంచు కప్పబడి నేలమట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఉండే ప్రాంతంలో జెండా వందనం జరిగిన వీడియోను ఐటీబీపీ పోస్టు చేసింది. ఆ తర్వాత సైనికులంతా కొద్దిపాటి దూరం వరకూ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.
#ITBP personnel celebrating #RepublicDay2019 at 18K Ft and minus 30 degree Celsius somewhere in Laddakh.#Himveers#Himalayas#HappyRepublicDay2019 pic.twitter.com/JOOBobu5ZU
— ITBP (@ITBP_official) January 26, 2019