న్యూయార్క్ లో ఓ హెలికాప్టర్ నదిలో కుప్పకూలిపోయింది. న్యూయార్క్ లోని హడ్సన్ నది దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో ఫ్యూయల్ నింపుకున్న హెలికాఫ్టర్ కొంత సేపటికే గాల్లో చక్కర్లు కొట్టుకుంటూ హడ్సన్ నదిలో కుప్పకూలింది.
న్యూయార్క్ లో ఓ హెలికాప్టర్ నదిలో కుప్పకూలిపోయింది. న్యూయార్క్ లోని హడ్సన్ నది దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో ఫ్యూయల్ నింపుకున్న చాపర్ కొంత సేపటికే గాల్లో చక్కర్లు కొట్టుకుంటూ హడ్సన్ నదిలో కుప్పకూలింది.
కాగా ఫ్యూయల్ నింపుకున్న అనంతరం గాల్లోకి ఎగిరిన చాపర్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి కంట్రోల్ తప్పి నదిలో కూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది,వాటర్ సేఫ్టీ అధికారులు హుటాహుటిన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు సురక్షితంగా బైటపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం టెక్నికల్ ప్రాబ్లమా లేకి వేరే కారణమేదైనా ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Terrifying video shows a helicopter spiraling out of control before crashing into the Hudson River. Thankfully, the pilot survived. https://t.co/UOejG4cI80 pic.twitter.com/PyJ0zZ1mDy
— Eyewitness News (@ABC7NY) May 15, 2019