Representative Image (Image Credit To Original Source)
Human Metapneumovirus: యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ తీరంలో కలకలం రేగింది. అంటువ్యాధి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇది అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) జనవరిలో గరిష్ట స్థాయికి చేరుకుంది. మార్చి ప్రారంభంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఉత్తర కాలిఫోర్నియాలో ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కో, మారిన్, వల్లెజో, నాపా, నోవాటో, శాంటా రోసా, సాక్రమెంటో, డేవిస్‌లలో వైరస్ పెరుగుతోంది.
దగ్గు, జ్వరం, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, గొంతు నొప్పి, గురక, ఊపిరి ఆడకపోవడం, దద్దుర్లు వంటి జలుబు లాంటి లక్షణాలను కలిగించే వైరస్. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తికి దగ్గు లేదా గురక రావచ్చు. ముక్కు కారడం లేదా గొంతు నొప్పి ఉండొచ్చు. HMPV అనేది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) లాంటి వైరల్ కుటుంబానికి చెందినది. దీన్ని మొదట 2001లో కనుగొన్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.
“ఇది ఫ్లూ కొవిడ్ లాగా సింగిల్-స్ట్రాండ్ RNA వైరస్” అని సీనియర్ మెడికల్ అనలిస్ట్ డాక్టర్ మార్క్ సీగెల్ ఫాక్స్ తెలిపారు. “వైరస్ పశ్చిమ దేశాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెరుగుతోంది. చాలా కేసులు తేలికపాటివి. కానీ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిలో చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఉన్నారు. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఏటా 650,000 మందికి పైగా ఆసుపత్రిలో చేరడానికి దారితీస్తుంది” అని సీగెల్ వెల్లడించారు.
HMPV సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధం, కలుషితమైన ఉపరితలాలు, శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ అంటువ్యాధి. కలుషితమైన ఉపరితలాలను తాకి ఆపై ముఖాన్ని తాకడం, సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధం, దగ్గు తుమ్ముల నుండి వచ్చే శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది.
ఈ వైరస్‌కు చికిత్స చేసే యాంటీవైరల్ మందులు ఏవీ లేవు. ఆరోగ్య సంరక్షణ నిపుణులు రోగికి ఆక్సిజన్ థెరపీ, IV ద్రవాలు, కార్టికో స్టెరాయిడ్‌లతో చికిత్స చేయడం ద్వారా పరిస్థితిని పర్యవేక్షించొచ్చు. మరింత దిగజారకుండా నిరోధించొచ్చు.
* తరచుగా చేతులు కడుక్కోవడం
* ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం
* అనారోగ్య వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం
* గాలి ప్రవాహం, వెంటిలేషన్ మెరుగుపరచడం