Spain : ఈ దేశంలో జస్ట్ రూ.22 వేలకే ఇళ్ల స్థలాలు.. మీరు చేయాల్సింది ఒకటే.. అది కూడా సింపుల్
Spain : ఓల్మెడా డి లా క్యూస్టా ఒకప్పుడు బానే ఉండేది. సుమారు 500 మంది జనాభా ఉండేవారు. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఇప్పుడు ఓ 15 మంది ఉంటున్నారు. వారాంతాల్లో వచ్చిపోయేవాళ్లు ఓ 20 మంది ఉంటారు.
- Harish Thanniru
- Published on- May 23, 2026 / 01:45 PM IST
Olmeda de la Cuesta town
Spain : ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రజలకు ఇలాంటి కలలే ఉంటాయి. అయితే, కొన్ని దేశాల్లో మాత్రం కొన్ని భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. జనాలు పల్లెటూళ్లు,చిన్న పట్టణాలను వదిలిపెట్టి నగరాలు,మహానగరాలు, విదేశాలకు వలసపోతుంటారు. కానీ, అక్కడ ప్రజలను ఉంచేందుకు కొన్ని ప్రభుత్వాలు పడరాని పాట్లు పడుతుంటాయి. వారికి ఫ్రీగా ఇళ్లు కట్టిస్తాయి. ఇతర వసతులు కల్పిస్తాయి. అక్కడ ఉంటున్నందుకు కొన్ని రాయితీలు ఇస్తాయి. అలాగే, అక్కడ ఇన్వెస్ట్ చేసే వారికి భారీ రాయితీలు ప్రకటిస్తాయి.
అలాంటిదే ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ. స్పెయిన్ లోని ఓ చిన్న పట్టణం అయిన ఓల్మెడా డి లా క్యూస్టాలో జనాభా తగ్గిపోతోంది. దీంతో అక్కడ నివాసాలు ఏర్పరుచుకునే వారికి ప్రభుత్వం ఆఫర్లు ప్రకటిస్తోంది. ఓల్మెడా డి లా క్యూస్టా అనేది ఓ చిన్న మున్సిపాలిటీ. చుట్టూ పర్వతాల మధ్య ఉంటుంది. చుట్టూ వ్యవసాయ భూములు ఉంటాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కూడా అందుబాటులో ఉంటాయి. కావాలంటే మంచి ఇల్లు కట్టుకోవచ్చు. బిజినెస్ లు పెట్టుకోవచ్చు.
ఎంత ప్లాట్ కి ఎంత రేటు?
60 చ.మీటర్లు (71 గజాలు) – 200 యూరోలు (సుమారు రూ.22,272)
87 చ.మీటర్లు (104 గజాలు) – 300 యూరోలు (సుమారు రూ.33,709)
205 చ.మీటర్లు (245 గజాలు) -1300 యూరోలు (సుమారు రూ.1.4 లక్షలు)
అయితే, చవకగా వస్తుంది కదా ఇన్వెస్ట్ మెంట్ కోసం ల్యాండ్ కొనేసి పక్కన పడేస్తే ఐదు, పదేళ్లకి అదే రేటు పెరుగుతుంది అని రియల్ ఎస్టేట్ మైండ్ సెట్ లో ఆలోచిస్తే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రభుత్వం ఈ రేటుకి ల్యాండ్ ఇస్తుందంటే అక్కడో చిన్న మెలిక ఉంది. భూమి కొన్న రెండున్నరేళ్లలో అక్కడ ఇల్లయినా కట్టాలి లేకపోతే వ్యాపారం అయినా పెట్టాలి.
ఓల్మెడా డి లా క్యూస్టా ఒకప్పుడు బానే ఉండేది. సుమారు 500 మంది జనాభా ఉండేవారు. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఇప్పుడు ఓ 15 మంది ఉంటున్నారు. వారాంతాల్లో వచ్చిపోయేవాళ్లు ఓ 20 మంది ఉంటారు. అక్కడి వారి సగటు వయసు 75. అంటే వృద్ధులే ఉంటున్నారన్నమాట. అక్కడ ఉన్నవారిలో అత్యంత పిన్నవయస్కుడి వయసు 47. ఇంకా చెప్పాలంటే ఆ మున్సిపాలిటీ మేయర్ కూడా అక్కడ పర్మినెంట్ గా ఉండడు. గత సంవత్సరం కూడా ఇలాగే ఆఫర్లు ప్రకటిస్తే ఓ ఆరుగురు కొన్నారు. అప్పటి కంటే ఇప్పుడు రేట్లు ఇంకా తగ్గించారు.
