Taliban Women Educaiton
Afghan Girl: అఫ్ఘానిస్తాన్‌ను తాలిబాన్లు ఆదీనంలోకి తెచ్చుకున్నప్పటి నుంచి అక్కడి మహిళలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. దశాబ్దాల కాలం తర్వాత తాలిబాన్లు అధికారం వచ్చి కాబూల్ ను ఆక్రమించుకున్నారు. రీసెంట్ గా తాలిబాన్ల ప్రభుత్వం ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.
మదరసాలు, ప్రైవేట్, పబ్లిక్ స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలు రీ ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అందులో పేర్కొంది. దేశవ్యాప్తంగా స్కూల్స్ కు తిరిగి వెళ్లేవారిలో బాలురు మాత్రమే ఉన్నారు కానీ, బాలికలు వెళ్లొచ్చని చెప్పలేదు. టీచర్లందరూ మగ విద్యార్థులు స్కూల్ కు రావాల్సిందేనని స్టేట్మెంట్ లో ఉంది.
ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత బాలురు, బాలికలు, విద్యార్థులు అందరూ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ బాలికలను కూడా చదువుకునేందుకు అనుమతించాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్లిప్పింగ్ ను అఫ్ఘాన్ జర్నలిస్టు బిలాల్ సర్వరీ షేర్ చేశారు.
ఈ క్లిప్ లో ఓ యువతి పవర్ ఫుల్ స్పీచ్ చెప్తూ.. అఫ్ఘానిస్తాన్ లో మహిళలు చదువుకోవాల్సిన అవసరం ఎంతుందో చెప్తుంది. దేశాభివృద్ధి కోసం, భవిష్యత్ జనరేషన్స్ కోసం బాలికలను చదివించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తుంది. ‘ఏదైనా చేయాలనుకుంటే ఇదే సరైన అవకాశం. అల్లాహ్ మనకు అవకాశం ఇచ్చాడు. దాంతో పాటు మహిళలకు సమాన హక్కులు కల్పించాడు. అయితే తాలిబాన్లు ఎవరు మన చేతుల్లో నుంచి హక్కులు, అవకాశాలు లాక్కోవడానికి? అంటూ నిలదీసింది.
…………………………………..హోటల్ లో లేడీస్ బాత్రూములో సీక్రెట్ కెమెరా
‘ఇవాళ బాలికలకు అడ్డు చెప్తున్నారు. రేపు తల్లులను అడ్డుకుంటారు. వాళ్లు నిరక్షరాస్యులైతే పిల్లలకు విద్యాబుద్ధులు ఎలా నేర్పించగలరు. నేను కొత్త జనరేషన్ పిల్లని, తినడం, పడుకోవడం, ఇంట్లో ఉండటం మాత్రమే చేస్తున్నా. స్కూల్ కు వెళ్లి దేశాభివృద్ధి కోసం ఏదైనా చేయాలనుకుంటున్నా’
‘చదువు లేకుండా మన దేశం డెవలప్ అవ్వాలంటే ఎలా కుదురుతుందని మీరు ఆలోచించారా.. నాకు చదువు లేకపోతే.. అఫ్ఘానిస్తాన్ లో ఏ బాలిక చదువు పొందలేకపోతే నెక్స్స్ట్ జనరేషన్ కు పద్ధతి ఎలా అలవాటవుతుంది. చదువు అనేది లేకపోతే ప్రపంచంలో మనకు విలువ ఎలా ఉంటుంది’ అని బాలిక నినాదాలు చేస్తూ ప్రసంగించింది.
“I want to go to school.” Powerful message from this eloquent Afghan girl. pic.twitter.com/PdAMtg9Fjm
— BILAL SARWARY (@bsarwary) September 22, 2021
ఈ వీడియోను షేర్ చేసిన సర్వరీ.. ‘నేను స్కూల్ కు వెళ్లాలనుకుంటున్నా అని పవర్‌ఫుల్ మెసేజ్ చెప్తుంది అఫ్ఘాన్ బాలిక అని పేర్కొన్నారు. ఈ బాలిక వీడియోపై నెట్టింట్లో ప్రశంసాపూరిత కామెంట్లు వస్తున్నాయి.