×
Ad

Pakistan: అదే జరిగితే.. భారత్‌తో యుద్ధమే..! రెచ్చిపోయిన పాకిస్తాన్ నాయకుడు..

ఓడరేవులు, సముద్రాలపై నియంత్రణ ఉన్న వారే ప్రపంచాన్ని పాలిస్తారు. పాకిస్తాన్-బంగ్లాదేశ్ సైనిక భాగస్వామ్యం ప్రాంతీయ అధికార సమీకరణాలను గణనీయంగా మారుస్తుంది.

Pakistan: షెహబాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) యువజన విభాగం నాయకుడు రెచ్చిపోయాడు. భారత్ కి హెచ్చరిక జారీ చేశాడు. బంగ్లాదేశ్‌పై ఏదైనా దాడి జరిగితే.. పాకిస్తాన్ సైన్యం, క్షిపణులు ప్రతి స్పందిస్తాయని అన్నాడు. ఈ మేరకు పీఎంఎల్ నాయకుడు కమ్రాన్ సయీద్ ఉస్మానీ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సైనిక కూటమిని కూడా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చాడు.

”ఒకవేళ భారత్.. బంగ్లాదేశ్ సార్వభౌమాధికారంపై దాడి చేసినా, బంగ్లాదేశ్‌ను దురుద్దేశంతో చూడటానికి సాహసించినా.. గుర్తుంచుకోండి, పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ సాయుధ దళాలు, మా క్షిపణులు ఎంతో దూరంలో లేవు” అని కమ్రాన్ అన్నాడు. అఖండ భారత్ సిద్ధాంతాన్ని బంగ్లాదేశ్‌పై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను పాకిస్తాన్ సహించదన్నాడు.

”బంగ్లాదేశ్‌ను “భారత దేశ సైద్ధాంతిక ఆధిపత్యంలోకి” నెట్టడాన్ని పాకిస్తాన్ అంగీకరించదు. బంగ్లాదేశ్‌పై దాడి చేసినా, దాని స్వయంప్రతిపత్తిపై “చెడు దృష్టి” పెట్టినా.. పాకిస్తాన్ బలవంతంగా స్పందిస్తుంది” అని కమ్రాన్ హెచ్చరించాడు. పాకిస్తాన్.. గతంలో భారత దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టిందని, అవసరమైతే మళ్ళీ అలా చేయగలదన్నాడు. పాకిస్తాన్ పశ్చిమం నుండి, బంగ్లాదేశ్ తూర్పు నుండి దాడి చేస్తాయన్నాడు. ఇక, చైనా అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌పై దృష్టి సారించిందన్నాడు.

“మా ప్రతిపాదన ఏమిటంటే, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేసుకోవాలి. బంగ్లాదేశ్‌లో పాక్ ఒక సైనిక స్థావరాన్ని, పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తమ తమ భూభాగాలలో ఒకరికొకరు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాలి. ఇటువంటి ఏర్పాటు వ్యూహాత్మక నియంత్రణను బలోపేతం చేస్తుంది. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌ను (CPEC) బంగ్లాదేశ్ ఓడరేవులతో కలుపుతుంది. ఓడరేవులు, సముద్రాలపై నియంత్రణ ఉన్న వారే ప్రపంచాన్ని పాలిస్తారు. పాకిస్తాన్-బంగ్లాదేశ్ సైనిక భాగస్వామ్యం ప్రాంతీయ అధికార సమీకరణాలను గణనీయంగా మారుస్తుంది” అని ఉస్మానీ అన్నాడు.

Also Read: రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ మెస్సీ సోద‌రి మరియా సోల్‌.. పెళ్లి వాయిదా..!