Pandit Rajesh: తాలిబన్లు నన్ను చంపినా అఫ్ఘాన్ వదిలిపోను : హిందూ పూజారి!

ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆవేదన ఒక్కటే మిగిలింది. దాదాపుగా ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్

Pandit Rajesh

Pandit Rajesh: ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆవేదన ఒక్కటే మిగిలింది. దాదాపుగా ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ ఆఫ్ఘన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అప్పట్లో ఐదేళ్ల పాటు తాలిబన్ల అరాచక పాలనను చూసిన ఆ దేశ ప్రజలు ఇప్పుడు తాలిబన్ల పాలనపై వణికిపోతున్నారు. అక్కడి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేయగా అక్కడి సైన్యం సైతం ఇతర దేశాలను పరారైంది. ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ఇప్పుడు పూర్తిగా దేశాన్ని గుప్పిట్లోకి తీసుకున్నారు.

తాలిబన్ల పాలనలో జీవించలేమంటున్న ఆఫ్ఘన్ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇతర దేశాలకు పారిపోతున్నారు. కాబుల్ విమానాశ్రయంలో విమానాలకు వేలాడుతున్న ప్రజల వీడియోలు, ఫోటోలు ప్రపంచమంతా వ్యాపించగా అక్కడి పరిస్థితిపై ఇప్పుడు ప్రపంచమంతా చర్చ జరుగుతుంది. అక్కడి ముస్లిం ప్రజలే ఆ దేశంలో ఉండేందుకు వణికిపోతూ పారిపోతుంటే ఓ హిందూ పూజారి మాత్రం ఆఫ్ఘన్ విడిచివెళ్లేదే లేదని భీష్మించుకు కూర్చున్నాడు. కాబుల్ లోని రత్తన్ నాథ్ ఆలయంలో పండిట్ రాజేష్ కుమార్ పూజారిగా ఉన్నారు.

అక్కడి పరిస్థితుల కారణంగా ముస్లిం ప్రజలే అక్కడే ఉండలేమని పారిపోతుంటే రాకేష్ కుమార్ మాత్రం ఆలయాన్ని విడిచి రానని చెప్తున్నారు. వందల ఏళ్లగా తమ పూర్వీకులు ఇక్కడే ఉంటూ గుడి బాగోగులు చూసుకుంటున్నారని.. ఇప్పుడు తాను ఇలా రత్తన్ నాథ్ ఆలయాన్ని వదిలేసి వెళ్లనని చెప్తున్నారు. తాలిబన్లు తనను చంపినా అది దేవుడి సేవగానే భావిస్తానని.. అంతేకాని దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు. పండిట్ రాజేష్ కుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.