సైన్స్ రిపోర్టు : Audi, BMW, Mercedes Benz వంటి ఖరీదైన కార్లు నడిపే వారు స్టూపిడ్ పర్సన్ కావచ్చు

ఖరీదైన కార్లు నడిపే వారి వ్యక్తిత్వం, స్వభావం గురించి ఓ సైన్స్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్లు నడిపే వారు స్టూపిడ్ పర్సన్ కావచ్చు..

  • Publish Date - February 26, 2020 / 06:50 PM IST

ఖరీదైన కార్లు నడిపే వారి వ్యక్తిత్వం, స్వభావం గురించి ఓ సైన్స్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్లు నడిపే వారు స్టూపిడ్ పర్సన్ కావచ్చు..

ఖరీదైన కార్లు నడిపే వారి వ్యక్తిత్వం, స్వభావం గురించి ఓ సైన్స్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్లు నడిపే వారు జెర్క్-jerk(స్టుపిడ్ పర్సన్, ఇడియట్, ఫూలిష్) అని అధ్యయనంలో తేలింది. వినడానికి కొంచెం చేదుగా ఉన్నా.. ఇది నిజం అని సైన్స్ అంటోంది. ఖరీదైన కార్లు నడిపే డ్రైవర్లు వరస్ట్ (worst) అని ఆ సైన్స్ రిపోర్టులో తేలింది. మరో విధంగా చెప్పాలంటే.. మూర్ఖులు అనే అర్థం వస్తుంది. నెవడా, లాస్ వెగాస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఖరీదైన కార్లు నడిపే వ్యక్తుల స్వభావం, వ్యక్తిత్వం, మనస్తత్వంపై అధ్యయనం చేశారు. వారి ఆధ్యయనంలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఎక్స్ పెన్సివ్ కార్లు నడిపే వ్యక్తులు ఫూలిష్ మనస్తత్వం కలిగుంటారని పరిశోధకులు గుర్తించారు.

ఖరీదైన కార్లు నడిపే వ్యక్తుల్లో జాలి, దయ ఉండవు:
ఖరీదైన కార్లు నడిపే వ్యక్తులు లేదా డ్రైవర్లు.. చాలా గొప్ప స్వభావం కలిగి ఉంటారనే అభిప్రాయం ఉంది. బాగా డబ్బున్న వ్యక్తులు కావడంతో.. ఉన్నతంగా ఆలోచన చేస్తారని, ఇతరులను గౌరవిస్తారని అనుకుంటాము. కానీ.. వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. కాస్ట్లీ కార్లు నడిపే డ్రైవర్ల తీరు వరస్ట్ గా ఉంటుందని తేలింది. ఖరీదైన కార్లు నడిపే వ్యక్తులు.. తమను తాము చాలా గొప్పగా భావిస్తారని అధ్యయనంలో తేలింది. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, పాదచారులకన్నా తాము గ్రేట్ అని ఫీల్ అవుతారట. అంతేకాదు.. పాదచారులు.. రోడ్డు క్రాస్ చేసేందుకు అస్సలు ఒప్పుకోరట.

మేము గ్రేట్ అనే ఫీలింగ్:
సాధారణంగా రోడ్డుపై వెళ్లే సమయంలో ఎవరైనా పాదచారులు రోడ్డు క్రాస్ చేస్తుంటే.. వాహనాలను స్లో చేసి వారు వెళ్లేందుకు అవకాశం ఇస్తారు. కానీ ఖరీదైన కార్ల డ్రైవర్లు మాత్రం.. ఆ విషయంలో పరమ వరస్ట్ అని తేలింది. పాదచారులపై అస్సలు సానుభూతి చూపరట. వారిని చిన్నచూపు చూస్తారట. బాగా వాదించే గుణం ఎక్కువగా ఉంటుందట. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, పాదచారులపై కొంత కూడా సానుభూతి చూపరట. పైగా కారుని చాలా వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతారని, ట్రాఫిక్ రూల్స్ ని బేఖాతరు చేస్తారని రిపోర్టులో తెలిసింది.    

ట్రాఫిక్ ఉల్లంఘనలు, ర్యాష్ డ్రైవింగ్:
కోట్ల రూపాయలు విలువ చేసే ఖరీదైన కార్లు ఉదహరణకు ఆడి, బిఎమ్‌డబ్ల్యూ లేదా మెర్సిడెస్ వంటి ఉన్నత స్థాయి కార్లు నడిపే వారిలో మొండి పట్టుదల, అసమ్మతి, సానుభూతి లేకపోవడం, వాదించే స్వభావం ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు తేల్చారు. ఇతర వాహనదారులతో పోలిస్తే..ఖరీదైన కార్లు నడిపే వ్యక్తులు ఎక్కువగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడానికి ప్రధాన కారణం ఇవేనని చెబుతున్నారు. ఖరీదైన కార్లు నడిపే వ్యక్తులకు ఈ అధ్యయనం రుచించకపోవచ్చు. మమ్మల్ని వరస్ట్, స్టూపిడ్ అనడం కరెక్ట్ కాదని వాదించొచ్చు. సానుభూతి ఉండదని చెప్పడంలో వాస్తవం లేదని చెప్పొచ్చు. నిజమే.. ఈ అధ్యయనంలో చెప్పినట్టుగా.. ఖరీదైన కార్లు నడిపే వ్యక్తులందరూ అలాంటి వారే అని చెప్పలేము. వారిలో కొందరు మంచి వాళ్లు ఉండొచ్చు. మ్యాటర్ ఏంటంటే.. మెజార్టీ వ్యక్తులు అలాంటి స్వభావం(వరస్ట్) కలిగి ఉంటారనే విషయాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు