Marriage
Hindu Girl: పాకిస్తాన్‌లోని సింధూ ప్రాంతంలో 16ఏళ్ల హిందూ యువతికి ముస్లిం యువకుడితో బలవంతపు వివాహం జరిపించారు. ముందుగా కిడ్నాప్ చేసి మతమార్పిడి చేసినట్లు బాధితురాలి తరపు వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఇంటి బయట హిందూ కమ్యూనిటీ నిరసనకు దిగింది.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఖాజీ సింధూ ప్రాంతంలోని అహ్మద్ సిటీ నుంచి బాలికను అపహరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలిక ముస్లిం యువకుడిని ప్రేమించి వివాహం చేసుకునేందుకు ఇంట్లో నుంచి పారిపోయి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఆ యువకుడి తండ్రి అస్గర్ జోనోను అరెస్ట్ చేసిన పోలీసులు.. సెక్షన్ 365-బీ కింద కేసు నమోదు చేశారు.
Read Also: హిందూ యువతితో ప్రయాణిస్తున్న ముస్లింపై భజరంగ్ దళ కార్యకర్తల దాడి
ఈ ఏడాది ఆరంభంలో పూజా కుమారి అనే హిందూ యువతిని పాకిస్తాన్ లోని సింధు ప్రాంతంలో హత్య చేశారు. ఆందోళనకారులకు ఎదురు తిరిగినందుకు గానూ ఈ ఘటన నమోదైంది. పాకిస్తాన్ లోని మానవ హక్కుల సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.
16-year-old Hindu girl Kareena abducted, converted to Islam and married to the Muslim man. Hindu community stage protest in front of Zardari house in Nawabshah, seeking help of former president to recover the girl. #EndForcedConversions pic.twitter.com/Pu55Ejqa9V
— Naila Inayat (@nailainayat) July 13, 2022