Twins : ఆ స్కూల్లో ఎక్కువమంది కవలలే.. ఈసారి 17 సెట్ల కవలలు జాయిన్ అయ్యారు .. ఎక్కడంటే
ఆ స్కూల్లో ఎక్కువమంది ట్విన్స్ జాయిన్ అవుతుంటారు. ఈ సారి కొత్త విద్యా సంవత్సరంలో 17 సెట్ల కవలలు పేర్లు నమోదు చేసుకున్నారు. క్లాసులు ప్రారంభం అవ్వడానికి ముందు జరిగిన డ్రెస్ రిహార్సల్స్‌లో వీరిని చూస్తే ముచ్చటేసింది.
- Lakshmi 10tv
- Published On : August 13, 2023 / 03:13 PM IST
Scotland
Twins – Scotland : ఆ స్కూల్లో చాలామంది కవలలు చదువుకున్న రికార్డు ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో కవలలు వచ్చి చేరుతుంటారు. ఈ ఏడాది కూడా 17 సెట్ల కవలలు జాయిన్ అయ్యారు. ఎక్కడంటే?
స్కాట్లాండ్ లో కొత్త విద్యా సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో స్థానికంగా “ట్విన్‌వర్‌క్లైడ్” అని పిలువబడే ఇన్‌వర్‌క్లైడ్‌లోని పాఠశాలలకు వచ్చే వారం క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. 2023 కి గానూ ఈసారి 17 సెట్ల కవలలు తమ పేరు నమోదు చేసుకున్నారు. క్లాసులు అటెండ్ అవ్వడానికి ముందు వీరంతా పాట్రిక్స్ ప్రైమరీ స్కూల్, గ్రీనాక్‌లో డ్రెస్ రిహార్సల్ కోసం సమావేశమయ్యారు.
2015లో రికార్డు స్ధాయిలో ఇక్కడ 19 సెట్ల కవలలు ఇక్కడ చేరారు. 2013 నుంచి 147 సెట్లు కవలలు ఇక్కడ చదువుకున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ నమోదైన రెండవ అత్యథిక రేటుగా గుర్తించబడింది. ఈ సంవత్సరం నమోదు చేసుకున్న 17 సెట్ల కవలలో 15 సెట్ల కవలల్ని డ్రెస్ రిహార్సల్స్ కోసం గ్రీనాక్ లోని సెయింట్ పాట్రిక్స్ ప్రైమరీలో సమావేశ పరిచారు. వీరంతా ఒకచోట కనిపించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చాలా సందడిగా అనిపించింది. ఇక ఈ కవలల తల్లిదండ్రులకు తమ పిల్లల్ని చూసి ముచ్చటపడ్డారు.
