భారత్‌కు UAE కరోనా సాయం.. 7 టన్నుల వైద్య పరికరాలను పంపింది

  • Publish Date - May 3, 2020 / 05:59 AM IST

కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారతదేశానికి 7 టన్నుల వైద్య పరికరాలను యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పంపిణీ చేసింది. యూఏఈ నుంచి శనివారం (మే 2, 2020) మందుల కంటైనర్‌తో విమానం భారతదేశానికి బయల్దేరింది.

కరోనాపై యుద్ధం చేస్తున్న దాదాపు 7వేల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి అవసరమైన వైద్య పరికరాలను సాయంగా అందించనుంది కొవిడ్-19 మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారతదేశానికి కీలకమైన మద్దతును ఇవ్వాలని యూఏఈ నిర్ణయించుకుంది.

ఇరుదేశాల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న మైత్రిబంధానికి గుర్తుగా భారతదేశానికి యూఏసీ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది’ అని భారత్ లోని యూఏఈ రాయబారి  Ahmed Abdul Rahman Albanna చెప్పారు. కరోనా ఇన్ఫెక్షన్ పై పోరాడే సుమారు 7 వేల మంది వైద్య సిబ్బందికి సాయంగా మెడికల్ సప్లయ్‌ను అందించనుంది.

యూఏఈ ఇప్పటివరకూ 34 దేశాలకు 348 మెట్రిక్ టన్నులకు పైగా మందులను పంపిణీ చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా దాదాపు 348వేల మంది మెడికల్ ప్రొఫెషనల్స్‌కు యూఏఈ సాయం అందించింది. భారతదేశంలో ఇప్పటివరకూ 37,366 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, 26, 167 యాక్టివ్ కేసులు ఉన్నాయి.