కరోనాను తరిమికొట్టే దమ్ము భారత్‌కే ఉంది.. WHO

  • Publish Date - March 24, 2020 / 04:29 AM IST

రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతున్న COVID-19 వల్ల వణికిపోతున్న భారతీయులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Michael J Ryan మంగళవారం (మార్చి 24, 2020) ఓ శుభవార్త తెలిపాడు. అదేంటంటే.. కరోనా వ్యాప్తిని అడ్డుకునే విషయంలో భారతదేశానికి అద్భుతమైన సామర్థ్యం ఉందన్నాడు. స్మాల్-పాక్స్, పోలియోలను విజయవంతంగా తరిమికొట్టిన  భారత్ కరోనాను కూడా తరిమికొడుతోందని Michael J Ryan అన్నారు.

అంతేకాదు భారత్‌లో ఎక్కువగా జనసాంద్రం ఉండటం వల్ల ఈ వైరస్ అక్కడ ఎక్కువ కాలం ఉండే అవకాశం వుంటుందన్నారు. కాబట్టి భారత్‌కు ఇప్పుడు పెద్ద సంఖ్యలో ల్యాబ్‌లు చాలా అవసరమని విలేకరుల సమావేశంలో Michael ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 3లక్షల30వేలు దాటింది. మరణాల సంఖ్య 14వేలు దాటింది. 

అందుకని ఇప్పటికైనా కరోనా వ్యాప్తిలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను, రక్షణ సూచలను ప్రతీఒక్కరు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. లాక్‌డౌన్‌ను చాలా మంది ప్రజలు సీరియ్‌సగా తీసుకోవడం లేదు. దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాల్ని కాపాడుకోండి. పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పారు.

See Also | కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు: తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు అరెస్ట్.. వాట్సప్ గ్రూప్ అడ్మిన్లూ జాగ్రత్త