అమెరికాలో మేయర్‌ పదవికి పోటీలో అపర్ణ మాదిరెడ్డి!

  • Publish Date - January 11, 2020 / 01:41 AM IST

కాలిఫోర్నియాకు చెందిన శాన్ రామోన్ పట్టణంలోని మేయర్ సీటు కోసం బిడ్ ప్రకటించిన భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్త అపర్ణ మాడిరెడ్డి  నవంబర్‌ లో ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ రామోన్న్‌ నగరం నుంచి మేయర్‌ అభ్యర్థిగా ఆమె బరిలో నిలువనున్నారు. అపర్ణకు భర్త, ఒక కూతురు ఉన్నారు. అపర్ణ భూగర్భ శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు.

ప్రస్తుతం, ఆమె అమెరికాలో అర్వాసాఫ్ట్ అనే పేరుతో కాంట్రా కోస్టా రాష్ట్ర జనగణన 2020 కమిటీకి ప్రతినిధిగా.. నగరంలోని బహిరంగ స్థలాల సలహా సంఘం అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇక అపర్ణ గతంలో సిటీ కౌన్సిల్‌ సభ్యురాలుగా కూడా పనిచేశారు.

ఈ సందర్భంగా అపర్ణ మాట్లాడుతూ..  మా నగరం ఒక క్లిష్టమైన దశలో ఉన్నందుకు నేను మేయర్ పదవికి పోటీ పడ్డానని తెలిపారు. తనకున్న నాయకత్వ అనుభవంతో శాన్ రామోన్న్‌ నగరాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే కొన్ని దశాబ్దాల్లో శాన్‌ రామన్‌ సిటీని ఆర్థికంగా పటిష్ఠమైన శక్తిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె చెప్పారు. కాగా ప్రస్తుతం శాన్ రామోన్న్‌ కు బిల్‌ క్లార్క్‌సన్‌ మేయర్‌ గా ఉన్నారు.