India China Robotic Surgery : వైద్యరంగంలో సరికొత్త చరిత్ర.. చైనాలో వైద్యుడు.. హైదరాబాద్‌లో రోగికి రోబోటిక్ సర్జరీ..! 90 నిమిషాల్లో పూర్తి

India China Robotic Surgery : చైనా దేశంలోని వుహాన్ నగరంలోఉన్న భారతీయ వైద్య నిపుణుడు డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ ఘోస్ హైదరాబాద్‌లోఉన్న ఒక రోగికి దాదాపు 3వేల కిలోమీటర్ల దూరం నుంచే విజయవంతంగా రోబోట్ సహాయంతో శస్త్రచికిత్స నిర్వహించాడు.

India China Robotic Surgery

  • వైద్య రంగంలో సరికొత్త చరిత్ర
  • చైనాలో వైద్యుడు హైదరాబాద్‌లోని రోగికి శస్త్ర చికిత్స
  • రిమోట్ రోబోట్ సహాయంతో విజయవంతంగా సర్జరీ

India China Robotic Surgery : వైద్య రంగంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. చైనాలో ఉన్న వైద్యుడు దాదాపు 3వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లోని రోగికి రోబోటిక్ సహాయంతో శస్త్రచికిత్స నిర్వహించాడు. 90నిమిషాల్లో ఈ సర్జరీ పూర్తయింది. వైద్యుడు చైనాలోని వుహాస్‌లోని ఓ ఆస్పత్రిలో ప్రత్యేక కన్సోల్ ముందు కూర్చొని రోబోటిక్ చేతులను నియంత్రించగా.. హైదరాబాద్ లో వైద్య బృందం రోగిని సిద్ధంచేసి శస్త్రచికిత్సకు సహకరించింది. తద్వారా శస్త్ర చికిత్స విజయవతంగా పూర్తయింది.

Also Read : ఒకే రోజు 10 లక్షల కోళ్లు మృతి.. ఉన్నట్టుండి మెడ వేలాడేస్తున్న కోళ్లు.. ఏపీలో ఏం జరుగుతోంది?

చైనా దేశంలోని వుహాన్ నగరంలో ఉన్న భారతీయ మూత్రవ్యవస్థ నిపుణుడు డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ ఘోస్ హైదరాబాద్ లో ఉన్న ఒక రోగికి దాదాపు 3వేల కిలోమీటర్ల దూరం నుంచే విజయవంతంగా రోబోట్ సహాయంతో శస్త్ర చికిత్స నిర్వహించాడు. ఈ అద్భుతమైన ఆపరేషన్ చైనా అభివృద్ధి చేసిన అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థ, అత్యంత వేగవంతమైన 5జీ కమ్యూనికేషన్ నెట్ వర్క్ ఆధారంగా సాగింది.

డాక్టర్ మొహమ్మద్ ఘోష్ వుహోన్‌లోని టోంగ్జీ ఆస్పత్రిలో కన్సోల్ ముందు కూర్చొని అక్కడి బైనాక్యులర్ వ్యూయర్ ద్వారా రోగి శరీర అంతర్భాగాల త్రీడీ దృశ్యాలను అత్యంత స్పష్టంగా, పెద్దవిగా చూశారు. ఆయన అక్కడ కూర్చొని నియంత్రణ సాధనాలను కదిలిస్తుంటే.. హైదరాబాద్‌లో ఆపరేషన్ థియేటర్‌లోఉన్న రోబోటిక్ చేతులు సరిగ్గా అదే సమయంలో రోగి శరీరంలో కదలికలు చేస్తూ శస్త్రచికిత్సను పూర్తి చేశాయి. 5జీ సాంకేతికత వల్ల డాక్టర్ ఇచ్చిన ఆదేశాలు కేవలం 200 మిల్లీసెకన్ల (సెకనులో ఐదో వంతు)లోపే ఇక్కడి రోబోకు చేరి ఆపరేషన్ సజావుగా సాగింది.

ఈ శస్త్రచికిత్సకోసం వైద్యబృందం కొద్దిరోజులు ముందుగానే పకడ్బందీగా ప్రణాళికలు చేసుకుంది. ముందుస్తు ప్రణాళికల ప్రకారం రిమోట్ రోబోటిక్ సహాయంతో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అయితే, ఇంటర్నేషనల్ హెపాటో – పాంక్రియాటో – బిలియరీ అసోసియేషన్ చైనీస్ చాప్టర్ నిర్వహించిన 10వ కాంగ్రెస్ సందర్భంగా ప్రదర్శించిన 26 ప్రత్యక్ష శస్త్రచికిత్సలలో భాగంగా ఈ ప్రయోగం చేపట్టారు. ఇందులో భారతదేశంతోపాటు బ్రెజిల్, జార్జియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల నిపుణులు కూడా పాల్గొన్నారు. టోంగ్జీ ఆస్పత్రి సర్జరీ విభాగం డైరెక్టర్ చెన్ జియావోపింగ్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), 5జీ నెట్‌వర్క్, రోబోటిక్ సాంకేతికతలు వైద్య రంగ రూపురేఖలను మార్చేస్తున్నాయని కొనియాడారు.