Bhindi Price In US : వామ్మో.. అమెరికాలో కిలో బెండకాయ ధర ఎంతో తెలుసా? వీడియో చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..

Bhindi Price In US : అమెరికాలోని స్టోర్‌లో కిలో బెండకాయ ధర ఎంతో చూపిస్తూ భారతీయ యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rs 7200 Per Kg Okra In US Store

Bhindi Price In US : భారతదేశంలో అనేక రకాల కూరగాయాల్లో బెండకాయ ఒకటి. మన దేశంలో బెండకాయ చౌకగానే లభిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే, చాలామంది తమ ఇండ్లలోనే బెండ సాగు చేస్తుంటారు. ప్రస్తుతం హైదరాబాద్, ఇతర మార్కెట్లలో బెండకాయ కిలో ధర రూ.35 నుంచి 40 వరకు ఉంది. ఇదే బెండకాయ అమెరికాలో భారీగా ఉంటుంది. ఇదే విషయాన్ని అమెరికాలో ఉంటున్న ఓ భారతీయ యువకుడు వీడియో ద్వారా తెలియజేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వామ్మో.. కిలో బెండకాయ ధర అంతా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Also Read : Silver Hallmarking : వెండి హాల్‌మార్కింగ్ తప్పనిసరి అవుతుందా..? ఎదురయ్యే సవాళ్లపై బీఐఎస్‌ అధ్యయనం

అమెరికాలో నివాసం ఉంటున్న ఒక భారతీయుడు స్థానిక గ్రోసరీ స్టోర్‌కు వెళ్లాడు. అక్కడ ఇండియన్ వెజిటబుల్స్ సెక్షన్‌లో ఉన్న బెండకాయలను చూశాడు. వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమై దాని ధర చూడగా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అక్కడ అరకిలో బెండకాయ ధర దాదాపు 40డాలర్లుగా ఉంది. మన భారతీయ కరెన్సీ ప్రకారం.. లెక్కిస్తే ఒక కిలో బెండకాయ ధర అక్షరాలా రూ.7200 పైమాటే. దీంతో అతను అక్కడి బెండకాయ రేటును చూపిస్తూ వీడియో తీశాడు. ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయగా.. క్షణాల్లో వైరల్ గా మారింది.

ఆ యువకుడు వీడియోలో మాట్లాడుతూ.. మిత్రులారా.. నేను మీకు చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి చూపిస్తాను చూడండి. ఇదేంటి? భారతదేశంలో మనం కూరగాయల వంటకాలు చేయడానికి ఉపయోగించే బెండకాయ. అమెరికాలో చూడండి.. అదే స్నాక్‌గా దొరుకుతుంది. అంటే.. వేయించి, మసాలాలు, అన్నీ దానిపై‌వేసి ఇస్తారు. ఒక్కసారి దాని ధర చూడండి.. ఎంతంటే.. అది 6.50డాలర్లు. అంటే భారతీయ కరెన్సీల్లో దాని విలువ సుమారు రూ.600. అయితే, ఆ ప్యాకెట్ పరిమాణం కేవలం 85గ్రాములు మాత్రమే. అంటే కిలో రేటు దాదాపు రూ.7250 అని ఆయన వీడియోలో పేర్కొన్నాడు.

ఇదే వీడియోపై నెటిజన్లు, ముఖ్యంగా ప్రవాస భారతీయులు ‘చిన్నప్పుడు బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని ఇంట్లో వాళ్లు చెప్పారు.. కానీ అమెరికాలో ఈ బెండకాయ కొనాలంటేనే పెద్ద పెద్ద లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది’ అని కామెంట్ చేస్తున్నారు. మరొకరు, ‘ఆ రేటు చూశాక నాకు బెండకాయ మీద ఆశ చచ్చిపోయింది.. మన పప్పు చారు నయం’ అని రాసుకొచ్చారు.