London : థేమ్స్ నదిలో శవమై కనిపించిన భారతీయ విద్యార్ధి

ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన భారతీయ విద్యార్ధి కనిపించకుండా పోయాడు. రీసెంట్‌గా అతను థేమ్స్ నదిలో శవమై కనిపించడం సంచలనం రేపింది.

London

London : గత నెలలో తప్పిపోయిన భారతీయ విద్యార్ధి మిత్ కుమార్ పటేల్ శవమై కనిపించడం సంచలనం రేపింది. వాకింగ్ కోసం బయటకు వెళ్లిన మిత్ కుమార్ డెడ్ బాడీ థేమ్స్ నదిలో కనిపించింది.

Avika Gor : అప్పుడు ‘బాలిక వధూ’.. ఇప్పుడు ‘వధువు’.. చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ కొత్త సిరీస్.. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

భారత్‌లో ఓ రైతు కుటుంబానికి చెందిన మిత్ కుమార్ ఉన్నత చదువుల కోసం సెప్టెంబర్‌లో యూకే వెళ్లాడు. నవంబర్ 17 నుండి కనిపించకుండా పోయాడు. దీంతో అతని బంధువులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని ఆచూకీ కోసం ప్రయత్నించారు. నవంబర్ 21 న తూర్పు లండన్‌లోని కానరీ వార్ఫ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మరణానికి గల కారణాలపై విచారిస్తున్నారు.

Virat kohli : హాలిడే ట్రిప్.. కుమార్తె వామికతో కలిసి లండన్‌లో కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో వైరల్

మిత్ కుమార్ పటేల్ వయసు 23 ఏళ్లు. సెప్టెంబర్ 19, 2023 న యూకే వెళ్లాడు. అతను చనిపోవడంతో అతని కుటుంబానికి సాయం చేయడానికి పార్త పటేల్ అనే అతని బంధువు నిధుల సేకరణ చేయడం మొదలుపెట్టాడు. త్వరలో మిత్ కుమార్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిత్ కుమార్ షెఫీల్డ్ హాలం విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతూ అమెజాన్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేయడానికి నవంబర్ 20 న షెఫీల్డ్‌కు వెళ్లాల్సి ఉంది. ఈలోగానే అతను చనిపోవడం విషాదాన్ని నింపింది.