London Bridge : తెరుచుకున్న లండన్ బ్రిడ్జ్, ట్రాఫిక్ జామ్ సమస్యలోనూ అద్భుతాన్ని ఆస్వాదించిన నగరవాసులు

ట్రాఫిక్ జాబ్ లో ఇరుక్కుంటే ఇరిటేషన్ వస్తుంది..ఎప్పుడు క్లియర్ అవుతుందానిపిస్తుంది. కానీ లండన్ లో మాత్రం ట్రాఫిక్ జాబ్ సమస్యను కూడా చక్కగా ఎంజాయ్ చేశారు ప్రజలు. ఎందుకంటే..ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అధ్భుతం వారి కళ్లకు కనిపించింది. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్యను కూడా చక్కగా ఎంజాయ్ చేశారు నగరవాసులు.

London Bridge : తెరుచుకున్న లండన్ బ్రిడ్జ్, ట్రాఫిక్ జామ్ సమస్యలోనూ అద్భుతాన్ని ఆస్వాదించిన నగరవాసులు

London Bridge Open

London Bridge Open scene  : లండన్‌లోని ఐకానిక్ టవర్ బ్రిడ్జ్ తెరుచుకున్నప్పుడు చూడాలని ఎంతోమంది ఆశపడుతుంటారు. థేమ్స్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ లండన్ కే తలమానికంగా ఉంది. ఈ బ్రిడ్జ్ పెద్ద పెద్ద బోట్లు థేమ్స్ నదిలో వెళ్లే సమయంలో ఓపెన్ అవుతుంది. రెండుగా విడిపోయి పైకి లేస్తుంది. కానీ ఇది అరుదుగా జరుగుతుంటుంది. అలా తెరుచుకున్నప్పుడు చూడాలని చాలామంది ఉబలాటపడుతుంటారు.

అటువంటి వారి ఆశ నెరవేరేలో ఓ బోటుకు దారి ఇస్తు లండన్ బ్రిడ్జ్ గురువారం (సెప్టెంబర్ 28,2023)న మధ్యాహ్నం 1.15 గంటలకు తెరుచుకుంది. దీంతో ఆ బ్రిడ్జ్ పై వెళ్లే వాహనాలన్నీ నిలిచిపోయాయి. కానీ కాసేపటికే మూసుకోవాల్సి ఉంది. కానీ తిరిగి మూసుకోవటానికి మొరాయించింది. దీంతో బ్రిడ్జ్ పై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ అయ్యింది. కానీ పలు యత్నాలతో ఎట్లకేలకు సమస్యను పరిష్కరించి తెరుచుకున్న బ్రిడ్జ్ ని తిరిగిమూగలిగారు.

Pakistan : టూరిస్ట్ వీసాతో వెళ్లి విదేశాల్లో బిచ్చమెత్తుకుంటున్న పాకిస్థానీయులు, జేబు దొంగలుగానూ మారి సంపాదన

లండన్ బ్రిడ్జ్ తెరుచుకుంటే చూడాలని ఎంతోమంది అనుకుంటారు. అదే జరిగింది. కానీ తెరుచుకన్న బ్రిడ్జ్ చూడటానికి చాలా బాగుంది గానీ తిరిగి మూసుకోకపోవటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో ఇబ్బందులు పడ్డామని ఓ వీక్షకులు తెలిపారు. బ్రిడ్జి మూసుకున్నాక మాత్రం జనం చప్పట్లు, కేరింతలతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. హైడ్రాలిక్ సమస్య కారణంగా ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

థేమ్స్‌ నదిపై ఈ బ్రిడ్జ్‌ నిర్మాణం 1894లో పూర్తయింది. దీని జంట టవర్లు నదికి 61 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఈ రెండింటి మధ్య నిర్మించిన స్కైవాక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అదో అద్భుతంగా కనిపిస్తుంది. దీనిపై నుంచి కిందికి చూస్తే కింద వెళ్తున్న వాహనాలు, కిందనే నీటిలో ప్రయాణిస్తున్న పడవలను చూడొచ్చు. అదో అద్భుతమైన నిర్మాణం అని చెప్పి తీరాల్సిందే.