Pakistan : టూరిస్ట్ వీసాతో వెళ్లి విదేశాల్లో బిచ్చమెత్తుకుంటున్న పాకిస్థానీయులు, జేబు దొంగలుగానూ మారి సంపాదన

విదేశాల్లో అరెస్టవుతున్న బిచ్చగాళ్లలో 90 శాతం మంది పాక్ జాతీయులేనని వెల్లడైంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వమే వెల్లడించింది.

Pakistan : టూరిస్ట్ వీసాతో వెళ్లి విదేశాల్లో బిచ్చమెత్తుకుంటున్న పాకిస్థానీయులు, జేబు దొంగలుగానూ మారి సంపాదన

Pakistan begggar In foreign countries

Pakistan begggar IN foreign countries : భాతర దాయాది దేశం పాకిస్థాన్ కు ఎంత కష్టమొచ్చింది అనిపించేలా ఉంది అక్కడి ఆర్థిక పరిస్థితి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చిన్నపాటి అవసరాలకు కూడా కటకటలాడిపోతున్నారు. పాకిస్థాన్ లో ఈ దుస్థితి ఏ స్థాయికి చేరిందంటే..ఆర్థిక సంక్షోభాన్ని కొంతలో కొంతైనా గట్టెక్కించేందుకు పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో వ్యవసాయాన్ని మిలిటరీ చేత చేయించేందుకు సిద్ధమైంది. దీని కోసం దేశ వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని ప్రజల నుంచి కబ్జా చేసి ఆ భూమిలో సైన్యం వ్యవసాయం చేసేందుకు చర్యలు తీసుకుంది.

ఇదిలా ఉంటే పాకిస్థాన్ ప్రజల పరిస్థితి కాదు కాదు దుస్థితి ఎంత దారుణంగా ఉందంటే బిచ్చగాళ్లలా మారిపోతున్నారు. అప్పో సప్పో చేసిన వీసా తెచ్చుకుని విదేశాలకు వెళ్లి అక్కడ బిచ్చమెత్తుకునేలా మరాయి. టూరిస్ట్ వీసాతో విదేశాలకు అది కూడా ఖరీదైన కరెన్సీ ఉండే దేశాలకు వెళ్లి అక్కడ బిచ్చమెత్తుకుని డబ్బులు సంపాదించి వీసా గడువు పూర్తి అయ్యాక తిరిగి స్వదేశానికి వస్తున్నారు. సౌదీ, ఇరాన్, ఇరాక్‌లకు టూరిస్ట్ వీసాలతో వెళ్లి అక్కడ యాచకత్వం చేస్తున్నారు. దీంతో ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి.

Pakistan: అయ్యయ్యో పాకిస్తాన్.. అత్యంత దయనీయంగా ఆర్థిక పరిస్థితి.. పొలం పనుల్లోకి జవాన్లు

పాక్ నుంచి వచ్చి బిచ్చమెత్తుకునేవాళ్లను అరెస్ట్ చేస్తున్నాయి. అలా విదేశాల నుంచి బిచ్చమెత్తుకునేవాళ్లలో 90 శాతం మంది పాకిస్థానీయులే ఉన్నాయని తేలింది. ఈ విషయాన్ని ఏదో పాక్ శతృదేశాలు చేస్తున్న ఆరోపణలు కాదు స్వయానా పాకిస్థాన్ ప్రభుత్వమే వెల్లడించింది. పాకిస్థాన్‌కు చెందిన బిచ్చగాళ్లు భారీ సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నట్లు విదేశాంగ శాఖ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ తెలిపారు. విదేశాల్లో అరెస్టవుతున్న వారిలో 90శాతం మంది తమ దేశానికి చెందినవారే ఉన్నట్లు తెలిపారు. విదేశాల్లో పాకిస్థానీలకు సంబంధించి అక్కడి సెనేట్ లో చర్చ జరిగిన సందర్భంగా జుల్ఫికర్ హైదర్ ఈ విషయాన్ని తెలిపారు.

పాకిస్థాన్ నుంచి బిచ్చగాళ్లు విదేశాలకు భారీ సంఖ్యలో వెళుతున్నారని దీంతో అక్కడ అరెస్ట్ అవుతున్నారని అలా అరెస్ట్ అయినవారిలో 90 శాతం మంది పాకిస్థానీయులే కావటం ఆ దేశ దుస్థితిని నిదర్శనంగా కనిపిస్తోంది. అంతేకాదు విదేశాలకు వెళ్లిన పాకి బిచ్చగాళ్లు అక్కడ యాచకత్వమే కాకుండా జేబు దొంగలుగా కూడా మారి సంపాదిస్తున్నారని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. సౌదీ, ఇరాన్, ఇరాక్‌ వంటి దేశాలకు వెళ్లటానికి పాకిస్థానీయులు టూరిస్ట్ వీసాను ఉపయోగించుకుని వెళుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సౌదీ, ఇరాక్ హెచ్చరికలు జారీ చేశాయి.

విదేశాల్లో అరెస్ట్ అవుతున్న యాచకుల్లో 90 శాతం మంది పాకిస్థానీయులేనని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీరిలో ఎక్కువమంది సౌదీ, ఇరాన్, ఇరాక్‌ వంటి దేశాల్లోని పవిత్రస్థలాల్లో బిచ్చమెత్తుకుంటున్నారు. దీంతో వారిని ఆయా దేశాలు అరెస్ట్ చేస్తున్నాయి. విదేశాలకు వెళ్లిన పాకిస్థానీయులు డబ్బు సంపాదనకు బిచ్చమెత్తుకోవటమేకాకుండా జేబు దొంగలుగా కూడా తయారవుతున్నారని తేలింది. దీంతో పవిత్ర స్థలాల్లో భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్న యాచకులను, జేబుదొంగలను ఆయా దేశాల ప్రభుత్వాలు అరెస్ట్ చేస్తున్నాయి.వీరిలో 90శాతం మంది పాకిస్థానీయులే అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా పాక్ ప్రభుత్వమే అంగీకరించటం గమనించాల్సిన విషయం.

UN General Assembly: కొన్ని దేశాలకే ఆధిపత్యమనే రోజులు పోయాయి.. ఐక్యరాజ్య సమితిలో ఆసక్తికర ప్రసంగం చేసిన జైశంకర్

భారత్ తో ఎప్పుడు కయ్యానికి దిగుతున్న పాకిస్థాన్ అంతకంతకు సంక్షోభంలో కూరుకుపోతుంటే భారత్ మాత్రం ఓ వైపు చంద్రుడి పైకి వెళ్లే ప్రయోగాలు చేసే స్థాయికి చేరుకుంది. పాక్ పాలకులు చేస్తున్న తీవ్ర తప్పిదాలే ఆ దేశ పరిస్థితికి..దుస్థితికి కారణమవుతోందనే విమర్శలు వెల్లడవుతున్నాయి. పాక్ పరిస్థితి గురించి పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతు భారత్ చంద్రుడిపైకి చేరుకుంటే పాక్ మాత్రం పక్క దేశాలను అడుక్కుంటోంది అంటూ విమర్శించారు.

సౌదీ అరేబియాలో సుమారు 30 లక్షల మంది పాకిస్థానీయులు ఉన్నారని..అదే యూఏఈలో దాదాపు 15 లక్షలు, ఖతార్‌లో 2 లక్షల మంది పాకిస్థానీలు ఉన్నారు. పాక్ నుంచి విదేశాలకు వెళ్తోన్న యాచకుల సంఖ్య భారీగా ఉందని నివేదిక వెల్లడించింది. ఇలా యాచకులు తమ దేశాలకు భారీగా తరలి వస్తుండటంతో సౌదీ, ఇరాక్ వంటి దేశాలు పాకిస్థాన్ ను హెచ్చరించాయి.