ఇండోనేషియలో ఓ ఉప్పునీటి సరస్సులో నివసిస్తున్న ఓ జెయింట్ మొసలి మెడకు ఓ టైర్ ఇరుక్కుపోయింది. ఆ టైర్ ను మొసలి మెడ నుంచి తీయటానికి అధికారులు చాలారకాలుగా ప్రయత్నించారు.కానీ సాధ్యం కాలేదు. దీంతో మొసలి మెడ నుంచి టైర్ ను తీసినవారికి భారీగా నగదు బహుమతిగా ఇస్తామని అధికారులు ప్రకటించారు. డబ్బుల కోసం ఈ సాహసానికి పూనుకుని వచ్చినవారికి అది సాధ్యంకావటంలేదు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది.
13 అడుగులు (4మీటర్లు) ఉన్న మొసలి మెడకు అనుకోకుండా ఓ టైర్ ఇరుక్కుపోయింది. ఇలా ఆ టైర్ వల్ల ఆ మొసలు చనిపోతుందేమోనని అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో అధికారులు ఈ ప్రకటన చేశారు. డబ్బుల కోసం ఆశపడిన కొంతమంది ఈ సాహసానికి పూనుకున్నారు. కానీ వారి వల్ల కాలేదు. ఫెయిల్ అవుతూనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది.
దీనిపై జంతు ప్రేమికులు పెద్ద ఎత్తున స్పందిస్తూ..సెంట్రల్ సులవేసి సహజ వనరుల పరిరక్షణ సంస్థ అధిపతి హస్ముని హస్మార్,మొసలికి దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. దాని జీవితానికి…ఏమాత్రం భంగం కలిగించవద్దని ప్రజలను కోరుతున్నామని తెలిపారు.