International Flights: ఆ తేదీ వరకూ ఇండియా నుంచి బయటకు వెళ్లేదే లేదు..

 డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

International Flights: డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇండియా నుంచి వెళ్లాల్సిన, లేదా ఇండియాకు రావాల్సిన విమానాలు సెప్టెంబర్ 30వరకూ రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. ఈ నిబంధన అన్నీ కార్గో ఆపరేషన్లకు వర్తించదని.. ప్రత్యేకంగా అప్రూవల్ పొందిన వాటికి మినహాయింపు ఉంటుందని అందులో పేర్కొంది.

ఏదేమైనా అంతర్జాతీయ విమానాలు నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించనున్నాయి.
ప్రకటనలో పేర్కొన్న దానిని బట్టి చూస్తే.. సెప్టెంబర్ 30 అర్ధరాత్రి 11గంటల 59నిమిషాల వరకూ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులు రద్దు అయిపోయాయి. ముందుగా 2020 జూన్ 26న అంతర్జాతీయ విమాన ప్రయాణాల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు. దానిని పొడిగిస్తూ.. ఆదివారం ఆగష్ఠు 29న రీసెంట్ గా మరో ప్రకటన వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు