Iran Israel War: నిమిషాల్లోనే 1430 మిస్సైళ్ల వర్షం.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు

ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. వార్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.

  • Published On : March 14, 2026 / 09:42 PM IST

Iran Attacks Representative Image (Image Credit To Original Source)

  • తగ్గేదేలే అంటున్న ఇరాన్
  • ప్రతీకార దాడులు కంటిన్యూ
  • ఇజ్రాయెల్ పై భీకర దాడులు
  • నిమిషాల్లో 1430 క్షిపణుల వర్షం

 

Iran Israel War: యుద్ధంలో ఇరాన్ తగ్గేదేలే అంటోంది. మరింతగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇజాయెల్ పై భీకర దాడులకు దిగింది. నిమిషాల్లోనే 1430 మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఉత్తర, దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ పై ఒకేసారి అటాక్ చేసింది. నగరంపై క్లస్టర్ బాంబులు వేసింది. ఈలట్ నగరంపై మిస్సైళ్లతో అటాక్ చేసింది ఇరాన్. దీంతో అక్కడ భీతావాహ వాతావరణం ఏర్పడింది.

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం మూడో వారానికి చేరింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు కలిసి ప్రారంభించిన ఈ యుద్ధం ఇవాళ్టికి 15 రోజులు అవుతోంది. 15వ రోజు కూడా మిడిలీస్ట్ లో వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇరాన్ లోని కీలక లక్ష్యాలే టార్గెట్ గా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఓవైపు ఇరాన్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అటు లెబనాన్ పై కూడా దాడులు కంటిన్యూ చేస్తూనే ఉంది. అటు అమెరికా కూడా అటాక్స్ కొనసాగిస్తోంది.

తాజాగా ఇరాన్ లోని ఖర్గ్ ఐలాండ్ పై అమెరికా దాడులు చేసింది. అటు ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. వార్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ఓవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్న యూఎస్ ఎయిర్ బేస్ లపై దాడులు చేస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలోని అమెరికా ఎయిర్ బేస్ పై అటాక్ చేసింది ఇరాన్. ఈ దాడిలో అమెరికాకు చెందిన పలు విమానాలు ధ్వంసమైనట్లు సమాచారం. అటు గల్ఫ్ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ పై క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

అయితే, ఇరాన్ ప్రకటనను అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్ పై అమెరికా చేస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఈ అబ్రహం లింకన్ నౌక మద్దతు ఇస్తూనే ఉందని పేర్కొంది. అటు ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్ లో 15 మంది మరణించారని, 2వేల మందికిపైగా గాయపడ్డారని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన యుద్ధం ఇరాన్ కు తీవ్ర నష్టం మిగిల్చింది. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్ పై జరిపిన దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 1444 మంది చనిపోయినట్లు ఇరాన్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. 18వేల 551 మంది తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. మృతుల్లో 200 మంది మహిళలు, 168 మంది చిన్నారులు, 55 మంది హెల్త్ కేర్ వర్కర్లు ఉన్నట్లు ఇరాన్ హెల్త్ మినిస్టర్ తెలిపారు.

Also Read: డాలర్‌కు మూడిందా? అమెరికాను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ఇరాన్ దిమ్మతిరిగే వ్యూహం..