Iran-Israel war
Iran-Israel war : ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం క్రమంగా ముదురుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కటుంబ సభ్యుల్లో కొందరు మరణించారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకుదిగింది. ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోనూ ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర వాతావరణం నెలకొంది.
Also Read : Tummala Nageswara Rao : యుద్ధం ఎఫెక్ట్.. దుబాయ్‌లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నాలుగు వారాలు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ట్రంప్ ఇరాన్ ఐఆర్‌జీసీ, మిలిటరీ దళాలకు ఓ ఆఫర్ ఇచ్చారు. ఆయుధాలు వదిలేసిన వారిని ప్రాణాలతో వదిలేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఆయుధాలు వదలకపోతే చావు తప్పదంటూ హెచ్చరించారు. ప్రస్తుత అవకాశాన్ని వాడుకొని ఇరాన్ ప్రజలు స్వాతంత్ర్యం పొందాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
మరోవైపు యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుంది. ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని దౌత్య కార్యాలయాన్ని అరబ్ ఎమిరేట్స్ మూసేసింది. ఆదివారం హర్మోజ్ జలసంధిలో నుంచి వెళ్తున్న చమురు నౌకలపై ఇరాన్ దాడి చేసింది. దీంతో హార్మోజ్ జల సంధి మూసివేత నేపథ్యంలో పెరగనున్న ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. గల్ప్ దేశాల ఆదాయ మూలాలను దెబ్బకొట్టేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని ఇరాన్ టార్గెట్ చేసింది. డ్రోన్‌లతో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ భారీ విధ్వంసం సృష్టించింది. దీంతో 5.5లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
అమెరికా ఇరాన్ చర్చలకు సిద్ధమైందన్న వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను ఇరాన్ ఖండించింది. అమెరికాతో చర్చలు జరిపేది లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అమెరికాతో చర్చించాలనుకోవడం లేదని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ ప్రకటించారు. దౌత్యపరమైన వ్యవహారాల్లో అమెరికాది చెత్త రికార్డు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యుద్ధంలోకి మరో మూడు దేశాలు..!
ఇరాన్ దాడులను బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఖండించాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణిదాడులను ఆ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సమయంలో మిత్రదేశాలకు అండగా ఉంటామని, ఇరాన్ క్షిపణి లాంచర్‌లను ధ్వంసం చేయడానికి బ్రిటన్ స్థావరాలను అమెరికా ఉపయోగించుకోవచ్చునని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్లు, క్షిపణులను ఆకాశంలోనే అడ్డుకునేందుకు ఈ దేశాలు సైనిక సహకారాన్ని అందిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ దాడుల వల్ల జోర్దాన్‌లోని జర్మనీ సైనిక శిబిరం సమీపంలో పేలుళ్లు జరగడం పరిస్థితి తీవ్రతకు అర్ధం పడుతోంది. అమెరికాకు తోడుగా యూరోపియన్ దేశాలు కూడా రంగంలోకి దిగడంతో ఈ సంక్షోభం ప్రాంతీయ యుద్ధం స్థాయిని దాటి గ్లోబల్ వైడ్ ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే వరల్డ్ వార్‌కు దారితీసే ప్రమాదం కూడా పొంచిఉందన్న వాదన కూడా వినిపిస్తోంది.