Iran Oman Deal: హార్ముజ్ జలసంధి వివాదం.. ఇరాన్-ఒమన్ మధ్య కీలక ఒప్పందం.. అమెరికాకు భారీ షాక్

హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, ఒమన్(Iran Oman Deal) దేశాల మధ్య ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది.

Iran oman strait of hormuz revenue sharing deal

  • ఇరాన్ ఒమన్ ఆదాయ పంపిణీ
  • హార్ముజ్ జలసంధి దిగ్బంధం తీవ్రం
  • సైనిక నౌకలకు ప్రవేశ నిరోధం

Strait Of Hormuz: ప్రపంచ ఇంధన రవాణాకు నాడి వంటి హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఒక వ్యూహాత్మక ఒప్పందం (Iran Oman Deal)కుదిరింది. ఈ కీలక జలమార్గం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇరు దేశాలు ఎలా పంచుకోవాలనే అంశంపై స్పష్టమైన అంగీకారానికి వచ్చినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించాయి. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కాపాడేందుకు పొరుగు దేశాలతో దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నామని స్పష్టం చేసినప్పటికీ, అమెరికా తమ కఠిన నిబంధనలు, షరతులను పూర్తిగా అంగీకరించే వరకు ఈ జలసంధిని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని టెహ్రాన్ స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తోంది.

Palnadu Accedent: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ బస్సు-ఆటో ఢీ.. ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం

అంతర్జాతీయ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం:

గత కొన్ని నెలలుగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు దాదాపు స్తంభించిపోయాయి. ప్రపంచ చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG) ఎగుమతుల్లో ఐదో వంతు ఈ మార్గం నుంచే జరుగుతాయి. ప్రస్తుతం రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనికి తోడు అమెరికా కొత్తగా మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించడంతో ఈ సంక్షోభం మరింత సంక్లిష్టంగా మారింది.

సైనిక నౌకలపై నిషేధం – షరతులు విధించిన ఇరాన్:

ఏ దేశానికి చెందిన సైనిక నౌకలను కూడా హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్లనివ్వబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే వాణిజ్య నౌకల రాకపోకలను మాత్రం కఠిన నిఘా నడుమ పర్యవేక్షిస్తామని తెలిపింది. యుద్ధాన్ని తక్షణమే ముగించడం, ఇరాన్‌పై విధించిన ఆర్థిక దిగ్బంధాన్ని ఎత్తివేయడం వంటి తమ హామీలను అమెరికా నెరవేర్చితేనే జలసంధిని పూర్తిస్థాయిలో తెరుస్తామని తేల్చిచెప్పింది. యెమెన్‌లో హౌతీల ఘర్షణలు మళ్లీ మొదలవ్వడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకున్నాయి.