Iran vs Israel War : యుద్ధానికి విరామం.. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. ఇరాన్ ఏమన్నదంటే?
Iran vs Israel War : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా వార్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు.
- Harishth Thanniru
- Published On : March 23, 2026 / 05:05 PM IST
donald trump Key announcement on Iran vs Israel War
- ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత
- ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
- ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి
Iran vs Israel War : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా వార్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, ఈ క్రమంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల వరకు దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Also Read : BRS MLA Malla Reddy : రేవంత్ ని సీఎం చేసింది నేనే.. ముఖ్యమంత్రి కావాలని ఉంది : మల్లా రెడ్డి
ఇరాన్‌తో రెండు రోజులుగా చర్చలు జరుపుతున్నాం.. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని ట్రంప్ చెప్పారు. పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా సాగుతున్నామని, ఈ క్రమంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఐదు రోజుల వరకు దాడులు చేయబోమని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, మరో వారంరోజుల పాటు చర్చలు జరగొచ్చునన్న ట్రంప్.. అప్పటి వరకు దాడులు జరపమని చెప్పారు. అయితే, చర్చలు ఫలితంపై ఆధారపడి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, చర్చలు సఫలం అవుతాయని తాను భావిస్తున్నానని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది.. ట్రంప్ బయపడ్డారని పేర్కొంది. విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలతో ఆయన వెనక్కి తగ్గారని ఇరాన్ అధికారిక టెలివిజన్ (IRIB) పేర్కొంది. ఇదిలాఉంటే.. తమ విద్యుత్ ప్లాంట్లపై ఏవైనా దాడులు జరిగితే, వాటికి తగిన విధంగా ప్రతిస్పందిస్తామని, అలాగే హార్ముజ్ జలసంధిని నిరవధికంగా మూసి ఉంచుతామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరించింది. దీంతో ఆదివారం చమురు ధరలు పెరిగాయి. అయితే, తాజాగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తామని ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి.
