Acid Rain In Iran
Acid Rain In Iran : పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇరాన్‌పై ముఖ్యంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్, దాని పరిసర ప్రాంతాల్లోని చమురు నిక్షేపాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. చమురు నిల్వ డిపోలు, శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకొని రాత్రివేళల్లో వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల తరువాత టెహ్రాన్‌లోని ప్రజలు ఆశ్చర్యకరమైన దృశ్యాలను గమనించారు. ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో కమ్ముకొని.. వర్షపు చినుకులు పడటాన్ని గమనించారు. ఈ వర్షం పడిన ప్రాంతాల్లో రోడ్లు, కార్లు, భవనాలపై జిడ్డుతోపాటు, నల్లటి మరకలు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీధుల్లోని నీటి గుంతలు చమురు అవశేషాలు, మసితో కలుషితమైనట్లు కనిపించాయి.
Black rain has fallen over Tehran after strikes on oil facilities, coating streets and rooftops in dark, oily waterpic.twitter.com/It8U6SCvaY
— Massimo (@Rainmaker1973) March 8, 2026
బయటకు రావొద్దంటూ హెచ్చరికలు..
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా చమురు నిల్వలున్న ప్లాంట్లలోని సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్ వంటి ప్రమాదకర రసాయనాలు గాలిలో కలిసిపోయాయి. ఈ తరుణంలోనే గాలిలోని రసాయనాలు, ఆయిల్ నీటితో కలిసి భూమిపై వర్షం రూపంలో పడుతున్నాయని స్థానికులు చెబుతున్నాయి. అయితే, ఇండ్లలోని నుంచి బయటకు రావొద్దని స్థానిక ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ పర్యావరణ సంస్థ టెహ్రాన్‌లోని ప్రజలు ఇంటి లోపలే ఉండాలని హెచ్చరించింది. వర్షంలో ఉన్న విషపూరిత రసాయనాలు చర్మ, ఊపిరితిత్తులకు హాని కలిగించవచ్చునని రెడ్ క్రెసెంట్ తెలిపింది. వర్షం తరువాత వెంటనే ఎయిర్ కండీషనర్లు ఆన్ చేయడం, బయటకు వెళ్లడం మానుకోవాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే ముసుగులు ధరించాలని టెహ్రాన్ ప్రభుత్వం సిఫార్సు చేసింది.
ఆమ్ల వర్షం అంటే ఏమిటి..?
ఆమ్ల వర్షం అంటే.. నల్లటి వర్షం అని కూడా అంటారు. మసి, బూడిద లేదా పారిశ్రామిక కాలుష్య కారకాలు వంటి నల్లటి కణాలతో కలుషితమైన అవపాతం. ఇది సాధారణంగా పెద్ద మంటలు, పేలుళ్లు లేదా గాలిలోకి భారీ మొత్తంలో నల్లటి కణాలను విడుదల చేసి తీవ్రమైన కాలుష్య సంఘటనల తరువాత సంభవిస్తుంది. ఈ నల్లటి కణాలు వర్షపు మేఘాలతో కలిసినప్పుడు అవి నల్లటి, కలుషితమైన బిందువులుగా నేలపైకి తిగిరిగి వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటే..?
ఆమ్ల వర్షంను లేదా దాని బింధువులను కొద్దిసేపు తాకడం వల్ల తక్షణం తీవ్రమైన గాయం అయ్యే అవకాశం లేదు. కానీ, దానితోపాటు వచ్చే కాలుష్య కారకాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా ఈ కాలుష్య కారకాలను పీల్చినప్పుడు లేదా.. కళ్లకు, కంటి పరిసర ప్రాంతాల్లో తాకినప్పుడు కళ్లు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాదు.. ఊపిరితిత్తులకు తీవ్ర ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయి.
🔥 Watch this shocking footage from Tehran!
After strikes on oil storage facilities, flames poured onto the road. Fuel flooded into the sewer and drainage channels🚨 pic.twitter.com/cz0hijlTcY
— NEXTA (@nexta_tv) March 8, 2026
ఈ వర్షం వల్ల కలుషితమైన గాలిని పీల్చడం వల్ల వచ్చే అతిపెద్ద ఆరోగ్య ప్రమాదాల్లో శాశ్వకోస సమస్యలు. చమురు పరిశ్రమలపై పేలుళ్లు జరిగిన సమయంలో గాలిలో విడుదలయ్యే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఇతర సూక్ష్మ కణ పదార్థాలు ఊపిరితిత్తులలో లోతుగా చొచ్చుకుపోయి చాలా నష్టాన్ని కలిగిస్తాయి. అవి దగ్గు, ఆస్తమా , గొంతు సమస్యలు, గొంతు వాపుకు కారణమవుతాయి. ఈ సమస్య తీవ్రంగా ఉంటే ఊపిరితిత్తుల సమస్య లేదా శ్వాసకోశ సమస్యలతో తీవ్ర అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. పరిస ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తలనొప్పి, తలతిరుగుడు, మైగ్రేన్ సమస్యలు వస్తాయి. ఈ విష వాయువులు ఆక్సిజన్ స్థాయిలను తగ్గించి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.