×
Ad

Donald Trump: ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది- డొనాల్డ్ ట్రంప్ సంచలనం

పరాజయం పాలైన ఇరాన్.. గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పి లొంగిపోయింది. ఇకపై వారిపై కాల్పులు జరపనని హామీ ఇచ్చింది.

  • Published On : March 7, 2026 / 08:06 PM IST

Representative Image (Image Credit To Original Source)

  • ఇరాన్ ఓటమిపాలైన దేశం
  • అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడుల వల్లే ఇది సాధ్యం
  • పశ్చిమాసియాలో ఇక ఎవరినీ ఇరాన్ బెదిరించలేదు

 

Donald Trump: ఇజ్రాయెల్-అమెరికా దాడులతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగిన సంగతి తెలిసిందే. గల్ఫ్‌ దేశాలపై అటాక్స్ చేసింది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా పశ్చిమాసియా దేశాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఈ దాడులపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ కీలక ప్రకటన చేశారు. గల్ఫ్‌ దేశాలకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఆ దేశాలపై ఇకపై దాడులు చేయబోము అన్నారు. అయితే అవి తమపై ప్రత్యక్ష దాడికి దిగితే మాత్రం స్పందించే హక్కు ఇరాన్ కు ఉందని ఆయన తేల్చి చెప్పారు.

గల్ఫ్ దేశాలపై దాడులు చేయము అంటూ ఇరాన్ అధ్యక్షుడు చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇరాన్ ను లూజర్ (ఓడిపోయిన దేశం)గా అభివర్ణించారు ట్రంప్. పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పి మరీ ఇరాన్ లొంగిపోయిందన్నారు. ఇకపై దాడులు చేయబోమని ఇరాన్ హామీ కూడా ఇచ్చిందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడుల వల్లే ఇది సాధ్యమైందన్న ట్రంప్.. పశ్చిమాసియాను ఇరాన్‌ ఇక బెదిరించలేదని అన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌ సోషల్‌ వేదికగా పోస్ట్ పెట్టారు ట్రంప్.

“పరాజయం పాలైన ఇరాన్.. గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పి లొంగిపోయింది. ఇకపై వారిపై కాల్పులు జరపనని హామీ ఇచ్చింది. ఈ వాగ్దానం కేవలం అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగానే జరిగింది. వారు మధ్యప్రాచ్యాన్ని స్వాధీనం చేసుకుని పాలించాలని చూస్తున్నారు. వేల సంవత్సరాలలో, చుట్టుపక్కల ఉన్న మధ్యప్రాచ్య దేశాల చేతిలో ఇరాన్ ఓడిపోవడం ఇదే మొదటిసారి”.

వారు, ‘ధన్యవాదాలు అధ్యక్షుడు ట్రంప్’ అని అన్నారు. నేను, ‘స్వాగతం!’ అని అన్నాను. ఇరాన్ ఇకపై ‘మధ్యప్రాచ్యంలో ఎవరినీ బెదిరించ లేదు’. ఇరాన్ ఇప్పుడు ఓటమిపాలైన దేశం. వారు లొంగిపోయే వరకు లేదా పూర్తిగా కూలిపోయే వరకు అనేక దశాబ్దాల పాటు అలాగే ఉంటారు! ఈరోజు (మార్చి 7న) ఇరాన్ తీవ్రంగా దెబ్బతింటుంది. దుష్ట ప్రవర్తన కారణంగా ఇరాన్ పూర్తిగా విధ్వంసం కానుంది” అంటూ ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టారు ట్రంప్.

Also Read: వార్ ఎఫెక్ట్‌.. గ్యాస్ వినియోగదారులకు బిగ్‌షాక్.. భారీగా పెరిగిన ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..