Hormuz Strait: 30 రోజుల్లో హార్ముజ్ ఓపెన్.. కానీ, ఆధిపత్యం మాదే.. ఇరాన్ విదేశాంగ మంత్రి వార్నింగ్
హార్ముజ్ జలసంధి(Hormuz Strait)ని రాబోయే 30 రోజుల్లో తిరిగి తెరవనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు.
- V Santhosh Kumar
- Published on- June 28, 2026 / 05:45 PM IST
Iranian Foreign Minister Abbas Araghchi announced that Strait of Hormuz will reopened within 30 days.
- త్వరలో హార్ముజ్ జలసంధి ఓపెన్
- పూర్తి నియంత్రణ ఇరాన్ చేతిలోనే
- ఇజ్రాయిల్ దాడులపై ఇరాన్ ఆగ్రహం
Hormuz Strait: అమెరికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని రాబోయే 30 రోజుల్లో తిరిగి తెరవనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రి ఫువాద్ హుస్సేన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. హార్ముజ్ జలసంధిలో తాము ఏర్పాటు చేసిన అడ్డంకులను తొలగించి, యుద్ధానికి ముందున్న యథాతథ స్థితికి తీసుకువస్తామని స్పష్టం చేశారు. అయితే, ఈ జలసంధి పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే పనిచేస్తుందని, దీనిపై తమదే పూర్తి ఆధిపత్యమని ఆయన తేల్చిచెప్పారు.
హార్ముజ్ (Hormuz Strait)వ్యవహారంలో ఏ దేశమైనా లేదా బాహ్య శక్తులు జోక్యం చేసుకోవాలని చూస్తే, జలసంధి పునరుద్ధరణ ఆలస్యం కావడంతో పాటు ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని అరాఘ్చి హెచ్చరించారు. ఇదే సమయంలో లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుదిరిన ఒప్పందంలోని నిబంధనల ప్రకారం లెబనాన్‌తో సహా అన్ని రంగాలలో శత్రుత్వం ముగియాలని, ఇజ్రాయిల్ దాడులను అడ్డుకోవాల్సిన పూర్తి బాధ్యత అమెరికాదేనని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.
