Mojtaba Khamenei: తొలి ప్రసంగంలోనే.. అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్.. హర్ముజ్ జలసంధిపై సంచలన ప్రకటన

యుద్ధంలో నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తామని, గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 28 నాటి దాడిలో ఖమేనీ మృతి చెందగా మొజ్తాబా తీవ్రంగా గాయపడినట్లు ప్రచారం జరిగింది.

  • Published On : March 12, 2026 / 10:41 PM IST

Mojtaba Khamenei Representative Image (Image Credit To Original Source)

 

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సుప్రీం లీడర్ అయ్యాక టీవీలో ప్రసంగించిన మొజ్తబా తొలి సందేశంలోనే అమెరికాకు అదిరిపోయే హెచ్చరిక చేశారు. మినాబ్ స్కూల్ పిల్లల మృతికి ప్రతీకారం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తాము పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామన్నారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు మూసివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

ఇటు శత్రువులపై ఒత్తిడి పెంచేందుకే హర్ముజ్ జలసంధిని మూసివేశామని ప్రకటించారు మొజ్తబా. మరోవైపు యుద్ధంలో నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తామని, గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 28 నాటి దాడిలో ఖమేనీ మృతి చెందగా మొజ్తాబా తీవ్రంగా గాయపడినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన టీవీల ముందు ప్రత్యక్షం అవటం ద్వారా ఆయనకు పెద్ద గాయాలేమీ కాలేదని తెలుస్తోంది.

Also Read: యుద్ధం ముగించేందుకు సిద్ధం..! మూడు కండీషన్లు పెట్టిన ఇరాన్