Benjamin Netanyahu: నెతన్యాహు చనిపోయారా? 3 వారాలుగా యుద్ధం జరుగుతున్నా కనిపించని ఇజ్రాయెల్‌ ప్రధాని

ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉనికిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వార్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ ఇద్దరు నేతలు బహిరంగంగా ఎక్కడా కనిపించింది లేదు.

  • Published On : March 14, 2026 / 07:10 PM IST

Benjamin Netanyahu Representative Image (Image Credit To Original Source)

  • నెతన్యాహు ఉనికిపై అనుమానాలు
  • అసలు ప్రాణాలతోనే ఉన్నారా?
  • ఇరాన్ అటాక్స్ లో ఇజ్రాయెల్ ప్రధాని మరణించినట్లు ప్రచారం
  • మూడు వారాలుగా యుద్ధం జరుగుతున్నా ఎందుకు కనిపించడం లేదు?

Benjamin Netanyahu: ఏఐ యుగంలో ఏది నిజం ఏది అబద్దం అన్నది కనిపెట్టడం సవాల్ గా మారింది. నిన్నమొన్నటి వరకు ఏఐ ఎఫెక్ట్ తో సెలబ్రిటీలు ఇబ్బంది పడగా తాజాగా ఈ గాలి కాస్త ఇప్పుడు వార్ పై మళ్లింది. ఏఐ వీడియోలతో ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు వారాలుగా వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో ఏది నిజం ఏది అబద్దం అన్నది మాత్రం క్లారిటీ రావడం లేదు.

వార్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఒక ఎత్తు అయితే, ఏకంగా ఆ దేశాధినేతలే చనిపోయారంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో మరింత రచ్చ రాజేస్తున్నాయి. తాము చేసిన దాడిలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ చనిపోయాడని ఇజ్రాయెల్ చెబుతోంది. అదే సమయంలో ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా చనిపోయారని ఇరాన్ అంటోంది. ఇంతకీ ఈ ఇద్దరు నేతలు చనిపోకుంటే ఎక్కడ ఉన్నారు? ఇంతవరకు ప్రజల ముందుకు ఎందుకు రాలేదు? ఇదే ఇప్పుడు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్న.

ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉనికిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వార్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ ఇద్దరు నేతలు బహిరంగంగా ఎక్కడా కనిపించింది లేదు. పబ్లిక్ గా ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే వార్ లో ఇజ్రాయెల్ కి తోడుగా ఉన్న అమెరికా ఓ అడుగు ముందుకేసి ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఖమేనీ చనిపోలేదు, బతికే ఉన్నారు, కానీ ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయని స్టేట్ మెంట్ ఇచ్చింది.

Also Read: రంగంలోకి కిమ్.. ఒకేసారి 10 మిస్సైళ్ల ప్రయోగం.. ఏం జరుగుతోంది

ఇరాన్‌తో యుద్ధం వేళ నెతన్యాహు మరణించారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. యుద్ధం గురించి మాట్లాడిన వీడియోను నెతన్యాహు ఎక్స్ లో షేర్ చేశారు. అయితే, అందులో నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లున్నాయి. దీంతో ఇది AI వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెతన్యాహు మరణం గురించి శత్రు దేశానికి తెలియొద్దనే ఇలా ఏఐతో వీడియో చేసి రిలీజ్ చేశారని వాదిస్తున్నారు.