×
Ad

Golden Horizon: ఒక్క బటన్ నొక్కితే పాక్‌ పని ఖతం..! భారత్‌కు మిస్సైల్‌ ఆఫర్‌ చేసిన ఇజ్రాయెల్‌.. గోల్డెన్ హొరైజన్‌ క్షిపణి ప్రత్యేకతలు ఏంటి

శత్రు దేశ గగనతలం లోపలికి ప్రవేశించకుండానే.. సుదూర లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం భారత వాయుసేనకు వస్తుంది.

  • Published On : February 25, 2026 / 11:52 PM IST

Golden Horizon Representative Image (Image Credit To Original Source)

  • ఇజ్రాయెల్ నుంచి గోల్డెన్ హొరైజన్ క్షిపణి!
  • శత్రువు గుండెల్లో దడ పుట్టించే క్షిపణి ఇది..
  • ఒక్క బటన్ నొక్కితే పాక్‌ పని ఖతమ్‌…
  • గాలి నుంచి గాల్లోకి ప్రయోగించే మిస్సైల్‌…
  • పాకిస్థాన్‌కు ఇక నిద్రలేని రాత్రులు ఖాయమా?
  • ఎయిర్ లాంచ్‌డ్ బాలిస్టిక్ మిస్సైల్‌ గోల్డెన్ హొరైజన్‌ ఆఫర్‌

 

Golden Horizon: ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో పాక్‌కు బ్రహ్మోస్ పుట్టించిన భయం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆ పేరు చెప్తే.. ఉలిక్కిపడుతోంది పాక్‌ ! అలాంటి బ్రహ్మోస్‌ను మించి బలం, వేగం ఉన్న మిస్సైల్‌.. భారత రక్షణ రంగం అమ్ములపొదిలో చేరబోతోంది. అదే గోల్డెన్ హొరైజన్‌.. ఈ మిస్సైల్‌ను భారత్‌కు ఇచ్చేందుకు ఇజ్రాయెల్‌ ఆఫర్‌ ఇచ్చింది. అసలీ మిస్సైల్ ప్రత్యేకతలు ఏంటి.. ఇది క్రియేట్ చేసే విధ్వంసం ఎలా ఉండబోతోంది.

విధ్వంసానికి కేరాఫ్‌.. శత్రు దేశాలకు దబిడిదిబిడే..

పహల్గాం ఘటన తర్వాత.. ఆపరేషన్‌ సిందూర్‌ పరిణామాలతో భారత్ కొట్టిన దెబ్బకు పాక్‌కు మైండ్‌బ్లాంక్ అయింది. మన ఆయుధాల పవర్ ఏంటో.. భారత్‌ యుద్ధానికి దిగితే ఏం జరుగుతుందో.. ప్రపంచానికి తెలిసొచ్చింది. మన బ్రహ్మోస్‌ మిస్సైల్‌.. పాక్‌కు చుక్కలు చూపించింది. ఆ క్షిపణి పేరు చెప్తే.. ఇప్పటికీ పాక్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్‌. ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. సరికొత్త ఆయుధాలను.. డిఫెన్స్ అమ్ములపొదిలోకి చేరుస్తోంది. బ్రహ్మోస్ కంటే బలమైన, వేగమైన క్షిపణిని మన ఎయిర్‌ఫోర్స్‌ చేతుల్లోకి రాబోతోంది. ఎయిర్ లాంచ్‌డ్‌ బాలిస్టిక్ మిస్సైల్‌ గోల్డెన్ హొరైజన్‌ను భారత్‌కు ఆఫర్ చేసింది ఇజ్రాయెల్‌. విధ్వంసానికి కేరాఫ్‌గా నిలిచే ఈ క్షిపణి.. భారత్ చేతికి వస్తే సరిహద్దుల్లో తోక జాడించే శత్రు దేశాలకు గట్టి హెచ్చరిక వెళ్లడం ఖాయం.

గోల్డెన్ హొరైజన్.. సాధారణ క్రూయిజ్ మిస్సైల్స్ కంటే పూర్తిగా భిన్నమైన టెక్నాలజీతో క్రియేట్ చేశారు. దీనికి బ్రహ్మోస్ కంటే వేగం ఎక్కువ. ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ మిస్సైల్ ఇది. ప్రయోగించిన తర్వాత.. భారీ ఎత్తుకు చేరి, అక్కడి నుంచి వేగంగా కిందకు దూసుకొచ్చి లక్ష్యాన్ని తాకుతుంది. ఫ్లైట్ ప్యాటర్న్ కారణంగా.. వీటిని ట్రాక్‌ చేయడం, అడ్డుకోవడం చాలా కష్టం.

గోల్డెన్ హొరైజన్ మిస్సైల్‌.. మాక్‌ 5 కంటే ఎక్కువ హైపర్ సోనిక్ స్పీడ్‌తో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. సుమారు 1500 నుంచి 2వేల కిలోమీటర్ల వరకు దాడి చేసే అవకాశం ఉంది. బ్రహ్మోస్‌ లాంటి క్రూయిజ్ మిస్సైల్ కంటే వేగంగా లక్ష్యాన్ని చేరే అవకాశం ఉంది. ఈ మిస్సైల్‌ను Su 30MKI ఫైటర్ జెట్లపై అమర్చే అవకాశం ఉంటుంది. సుఖోయ్‌తో పాటు మిరాజ్ యుద్ధ విమానాలపైనా దీనిని ఏర్పాటు చేసే చాన్స్ ఉంది. ఈ క్షిపణి సూపర్‌సోనిక్ వేగంతో ప్రయోగించొచ్చు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా క్షణాల్లో లక్ష్యాన్ని చేరుకుని విధ్వంసం చేస్తుంది.

భూగర్భ బంకర్లు సైతం ధ్వంసం..

గోల్డెన్ హొరైజన్‌ మిస్సైల్‌లో అణు వార్‌హెడ్‌లను కూడా అమర్చే అవకాశం ఉంటుంది. దీంతో ఈ మిస్సైల్ మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇక దీనికి ఉన్న పరిధి కారణంగా.. శత్రు దేశ గగనతలం లోపలికి ప్రవేశించకుండానే.. సుదూర లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం భారత వాయుసేనకు వస్తుంది. భూగర్భ బంకర్లు, హార్డెన్ కమాండ్ సెంటర్లు, భారీ రక్షణ ఉన్న టార్గెట్లను ధ్వంసం చేయడానికి.. ఈ మిస్సైల్ ఉపయోగపడేలా డిజైన్ అయింది.

ఇది భారత్‌కు లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యాన్ని పెంచి.. ప్రాంతీయ డిటరెన్స్‌ను బలోపేతం చేస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో.. ఇరాన్ భూగర్భ బంకర్‌లను చేధించి మరీ.. ఈ మిస్సైల్ నష్టం కలిగించింది. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే.. ఎయిర్ లాంచ్డ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ను ఉపయోగిస్తున్నాయ్‌. వీటిని రష్యా, చైనా, ఇజ్రాయెల్ వంటి కొన్ని దేశాలు మాత్రమే ప్రయోగిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇచ్చిన ఆఫర్‌కు భారత్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఎయిర్‌ఫోర్స్ చరిత్రలో సరికొత్త చరిత్ర క్రియేట్ కావడం ఖాయం.

గోల్డెన్ హొరైజన్‌ మిస్సైల్‌ విషయంలో భారత్, ఇజ్రాయెల్ ప్రభుత్వాల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఐతే రెండు రోజుల పర్యటనకు ఇజ్రాయెల్ వెళ్లిన ప్రధాని.. ఈ టూర్‌లో గోల్డెన్ హొరైజన్‌ మిస్సైల్‌కు సంబంధించిన ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఈ మిస్సైల్‌ను మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా.. భారత్‌లో తయారు చేసే అవకాశాన్ని కూడా రెండు దేశాలు పరిశీలిస్తున్నాయ్‌. ఈ అత్యాధునిక గోల్డెన్ హొరైజన్ సిస్టమ్‌ను.. ఇజ్రాయెల్ ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశానికి ఇవ్వలేదు. భారత్‌తో స్నేహం కారణంగా దీన్ని ఆఫర్ చేసింది. ఇది మన చేతుల్లోకి వస్తే.. బలం రెట్టింపు అయినట్లే.