Hamas terrorists : ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌ల దాడి..ముగ్గురు హమాస్ ఉగ్రవాదుల హతం

ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులు హతం అయ్యారు. తమ ఫైటర్ జెట్‌లు ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులను హతమార్చాయని ఇజ్రాయెల్ తెలిపింది...

Israel Attack

terrorists terrorists : ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులు హతం అయ్యారు. తమ ఫైటర్ జెట్‌లు ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులను హతమార్చాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్‌పై దాడుల్లో ముఖ్యమైన పాత్ర పోషించిన దారాజ్ తుఫా బెటాలియన్‌కు చెందిన ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

Also Read :  Israel-Hamas war : ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో 50 మంది బందీల మృతి

దారాజ్ తుఫా బెటాలియన్‌లో ముగ్గురు సీనియర్ హమాస్ ఉగ్రవాదులపై తమ ఫైటర్ జెట్‌లు దాడి చేశాయని ఇజ్రాయెల్ మిలిటరీ శుక్రవారం తెల్లవారుజామున తెలిపింది. అక్టోబర్ 7వతేదీన ఇజ్రాయెల్‌పై హంతక దాడిలో బెటాలియన్ కార్యకర్తలు ముఖ్యమైన పాత్ర పోషించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హతమైన ముగ్గురు ఉగ్రవాదులను ఇజ్రాయెల్ మిలిటరీ విడుదల చేసిన చిత్రంలో చూపించింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు ముగ్గురు హమాస్ ఉగ్రవాదులను హతమార్చాయి.