Trump Meloni Spat: ట్రంప్ వర్సెస్ మెలోని.. అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు.. పచ్చి అబద్ధాలంటూ ఇటలీ ప్రధాని ఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Trump Meloni Spat) మధ్య చోటుచేసుకున్న ఒక పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
- V Santhosh Kumar
- Published on- June 19, 2026 / 07:11 PM IST
Italys meloni hits back at trump over g7 photo claims
- ఫోటో వివాదంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.
- ట్రంప్ మాటలన్నీ పచ్చి అబద్ధాలన్న మెలోని.
- అమెరికా పర్యటనను రద్దుచేసుకున్న ఇటలీ మంత్రి.
Trump Meloni Spat: ఇటీవల జరిగిన జీ7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Trump Meloni Spat) మధ్య చోటుచేసుకున్న ఒక పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకునే స్థాయికి చేరిన ఈ వివాదం, రెండు సంప్రదాయ మిత్రదేశాల మధ్య చారిత్రక బంధాన్ని ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టేసింది.
NEET Re Exam 2026: నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్.. సోషల్ మీడియా ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ
మెలోనిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు:
ఇటలీకి చెందిన లా7 (La7) టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. జీ7 సదస్సులో జార్జియా మెలోని తనతో ఫోటో దిగడానికి “బతిమలాడిందని” వ్యాఖ్యానించారు. ఆమెకు తనతో ఫోటో దిగడం ఎంతగానో కావాలనిపించిందని, ఆమె పరిస్థితి చూసి జాలివేసి తాను ఫోటోకు అంగీకరించానని చెప్పారు. తాను ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా మాట్లాడానని, దీనిపై ఆమె బహుశా సంతోషంగానే ఉండి ఉంటుందని ట్రంప్ అహంకారపూరితంగా వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఘాటుగా బదులిచ్చిన ఇటలీ ప్రధాని:
ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్రంప్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని, ఆయన మాటలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని పేర్కొన్నారు. “నేను కానీ, ఇటలీ దేశం కానీ ఎవరినీ ఎన్నడూ బతిమాలవు” అని ఆమె స్పష్టం చేశారు. అలాగే పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల చూపించే సానుకూలతను, ట్రంప్ తన సొంత పాత మిత్రదేశాల పట్ల చూపించకపోవడం నిరాశ కలిగిస్తోందని ఆమె ఘాటుగా విమర్శించారు.
దౌత్యపరమైన ముప్పు – పర్యటనల రద్దు:
ఈ వివాదం వ్యక్తిగత విమర్శలకే పరిమితం కాకుండా దౌత్యపరమైన సంక్షోభానికి దారితీసింది. ట్రంప్ వ్యాఖ్యలతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తాజాని తన రాబోయే అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ట్రంప్ ప్రవర్తన అమెరికా, ఐరోపాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను నాశనం చేస్తోందని మెలోని ముఖ్య సలహాదారు ఫాజోలారి ధ్వజమెత్తారు. ఇరాన్ యుద్ధంపై ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు, ఈ తాజా వివాదంతో మరింత క్షీణించాయి.
