Italy Blue Crabs : ప్రపంచానిదో సమస్య.. ఇటలీదో సమస్య.. పీతలను చంపడానికి ఆక్టోపస్‌లను వదులుతున్నారు..!

Italy Blue Crabs : ఇటలీ షెల్ఫిష్ పరిశ్రమను దెబ్బతీస్తున్న విదేశీ నీలి పీతల నియంత్రణకు శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం చేపట్టారు. సాధారణ ఆక్టోపస్‌లను ఏడ్రియాటిక్ సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Italy Blue Crabs octopus

  • నీలి పీతల భరతం పట్టేందుకు ఆక్టోపస్ సైన్యం
  • ఏడ్రియాటిక్‌లో 1.3 లక్షల పిల్ల ఆక్టోపస్‌ల విడుదల
  • నీలి పీతలపై ఆక్టోపస్‌ల దండయాత్ర
  • ఏడ్రియాటిక్‌లో భారీ ప్రయోగం

Italy Blue Crabs : ప్రపంచానిది ఒక సమస్య అయితే.. ఇటలీదో సమస్య.. ప్రస్తుతం నీలి పీతల బెడద ఇటలీని గట్టిగా పట్టిపీడిస్తోంది. ఇటలీ షెల్ఫిష్ ఇండస్ట్రీ భారీగా దెబ్బతింటోంది. విదేశీ నీలిపీతల నియంత్రణకు అదుపు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఇటలీ యంత్రాంగం కొత్త ప్రయోగం చేపట్టింది. ఇటలీ తీర ప్రాంతాల్లో నీలి పీతల సంఖ్య మత్స్యకారులకు పెద్ద సమస్యగా మారింది.

క్లామ్ బెడ్స్, మస్సెల్ స్టోరేజీని దెబ్బతీయడంతో పాటు చేపల వేట వలలను కూడా నీలి పీతలు నాశనం చేస్తున్నాయి. ఫలితంగా షెల్ఫిష్ పరిశ్రమకు కోట్లాది యూరోల నష్టం వాటిల్లింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇటలీ ఇప్పుడు సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. నీలి పీతల భరతం పట్టేందుకు ఆక్టోపస్ ఆర్మీని రంగంలోకి దించింది.

బోలోగ్నా యూనివర్శిటీ రీసెర్చర్లు ఎమిలియా-రొమాగ్నా ప్రాంతీయ ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ‘ఆక్టో-బ్లూ’ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 1,30,000 చిన్న ఆక్టోపస్‌లను ఏడ్రియాటిక్ సముద్రంలోకి వదిలారు.

ఆక్టోపస్ రక్షణ కోసం గుహలు :
అయితే, ఇవి పెద్ద ఆక్టోపస్‌లు కావు. కేవలం కొన్ని మిల్లీమీటర్ల సైజులో కనిపించే కొత్తగా పొదిగిన పారాలార్వాలు. సెసెనాటికో, రిసియోన్ సమీపంలోని సముద్ర జలాల్లో వీటిని వదిలారు. చిన్న ఆక్టోపస్‌లు పెరిగే సమయంలో రక్షణ కల్పించేందుకు సముద్రగర్భంలో కృత్రిమ ఆవాసాలను కూడా ఏర్పాటు చేశారు.

Read Also : Insta-Facebook Teen : మెటా సంచలనం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. వాళ్లకు రోజుకు 2 గంటలే..!

ఈ ప్రయోగం వెనుక అసలు కారణం లేకపోలేదు. నీలి పీతలను వేటాడే వాటిని పెంచడమే దీని ఉద్దేశం.. అనుకూల పరిస్థితుల్లో ఒక కిలో బరువున్న వయోజన ఆక్టోపస్ రోజుకు సుమారు 4 మధ్యస్థ నీలి పీతలను తినగలదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ఆక్టోపస్ సంతతిని పెంచడమే టార్గెట్ :
ప్రత్యేకించి, ఏదో కొత్త జాతిని సముద్రంలోకి వదలడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏడ్రియాటిక్‌లో ఇప్పటికే సహజంగా ఉన్న స్థానిక సాధారణ ఆక్టోపస్ జనాభాను పెంచడమే లక్ష్యమని అంటున్నారు. ఏది ఏమైనా ఈ కొత్త ప్రయోగం సక్సెస్ అవుతుందా? అంటే కచ్చితంగా చెప్పలేరు..

ఆక్టోపస్ పారాలార్వాల్లో మరణాల రేటు 99.9 శాతం వరకు ఉండొచ్చు. అందుకే, మొత్తం నీలి పీతల సమస్యను ఆక్టోపస్‌లు పరిష్కరిస్తాయని రీసెర్చర్లు కూడా అంచనా వేయడం లేదు. నీలి పీతల వేటతో పాటు ఈ ప్రయోగాన్ని విస్తృత నియంత్రణ వ్యూహంలో భాగంగానే అమలు చేస్తున్నారు. ఈ ప్రయోగంతో ఎంతవరకు ఆక్టోపస్ ఆర్మీ నీలి పీతల భరతం పడుతుందో చూడాలి..