Japan Earthquake: జపాన్‌లో మరో భారీ భూకంపం.. 6.3 తీవ్రతతో ప్రకంపనలు.. భయాందోళనలో స్థానిక ప్రజలు!

జపాన్‌(Japan Earthquake)లోని బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలే ఈ ప్రకంపనలకు కారణమని అధికారులు తెలిపారు.

Japan earthquake 6 point 3 magnitude hits bonin islands pacific ring of fire

Japan Earthquake: జపాన్ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించి తీవ్ర కలకలం రేపింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించిన కథనం ప్రకారం, జపాన్‌(Japan Earthquake)లోని బోనిన్ దీవుల సమీప ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనలో ఆస్తి లేదా ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఇదే సమయంలో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనాటు దీవుల్లోనూ 7.1 తీవ్రతతో మరో భారీ భూకంపం వచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Ponguleti Srinivas Reddy: రూ.150 కోట్లతో శాశ్వత కరవు నివారణ.. మూడు మండలాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’.. అసలు జపాన్‌లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయి:

జపాన్ భౌగోళికంగా అత్యంత ప్రమాదకరమైన ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో విస్తరించి ఉండటమే ఇక్కడ తరచూ ప్రకంపనలు రావడానికి ప్రధాన కారణం. పసిఫిక్, ఫిలిప్పీన్ సీ, యూరేషియన్, ఉత్తర అమెరికా టెక్టానిక్ ప్లేట్లు కలుసుకునే ఈ సంక్లిష్ట ప్రాంతంలో నిరంతరం కదలికలు జరుగుతుంటాయి. భూమి పొరల్లోని ఈ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొనడం లేదా కిందకు జారడం వల్ల ఏర్పడే విపరీతమైన ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు తీవ్ర భూకంపాలు సంభవిస్తాయి.